జాతీయ వార్తలు

అమితాబ్‌కు అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోద్‌పూర్, మార్చి 13: రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌లో ‘్థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ చిత్రం షూటింగ్ సమయంలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ అస్వస్థతకు గురయ్యారు. దానితో ఆయనకు చికిత్స చేసేందుకు వైద్యుల బృందం సెట్స్‌కు తరలి వచ్చి ఆయనకు చికిత్స చేసింది. తనకు బాగానే ఉందని, మళ్లీ తనను నిలబెట్టేందుకు వైద్యులు చికిత్సచేస్తున్నారని బచ్చన్ తన బ్లాగ్‌లో తెలిపారు. బచ్చన్‌కు అస్వస్థత వార్త కోట్లాది మంది ఆయన అభిమానుల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. ఈ సినిమా షూటింగ్ కోసం రాత్రింబవళ్లు పనిచేయడం, చాలా బరువైన దుస్తులు ధరించడం వల్ల అమితాబ్ అలసటకు గురై ఉండవచ్చునని వైద్యులు తెలిపారు.