జాతీయ వార్తలు

ఆసనాలు..సెల్ఫీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, జూన్ 21: పిల్లలతో పిల్లాడిలా, యువకులతో యువకుడిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మారిపోయారు. రెండో అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా చండీగఢ్ జరిగిన కార్యక్రమంలో ఆయన అందరితో కలివిడిగా కలిసిపోయారు. దాదాపు 30 వేల మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో 150మంది దివ్యాంగులతోనూ ఆయన సరదాగా మాట్లాడారు. కొంతమందితో ఆసనాలు వేయించటంలో ఆయన సహకరించారు.
16మంది దివ్యాంగులు చక్రాల కుర్చీలలోనే యోగాసనాలు వేశారు. దాదాపు 25 నిమిషాల పాటు ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాను యోగ చేయటానికి ముందు ఒకసారి ప్రాంగణం అంతా కలియదిరిగి అందరినీ పలకరించారు. ఈ యోగ కార్యక్రమంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, హర్యానా మంత్రులు, బిజెపి నేతలు పాల్గొన్నారు. పంజాబ్ గవర్నర్ కప్టాన్ సింగ్ సోలంకి, ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్ వయోవృద్ధులు కావటంతో కుర్చీలకే పరిమితం అయ్యారు.

చిత్రం చండీగఢ్‌లో నిర్వహించిన ప్రత్యేక యోగ కార్యక్రమంలో పాల్గొన్న దివ్యాంగులను ప్రధాని నరేంద్ర మోదీ పలకరిస్తుండగా సెల్ఫీ తీసుకుంటున్న ఒక దివ్యాంగుడు