జాతీయ వార్తలు

పదేళ్లలో సూపర్ పవర్‌గా భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 18: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పది సంవత్సరాల్లో దేశాన్ని సూపర్ పవర్ చేస్తాం. అమెరికా, చైనా సరసన నిలబెడతామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ ఆదివారం కాంగ్రెస్ ప్లీనరీలో ముగింపు ఉపన్యాసం ఇస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తోంది, తాను ప్రధాన మంత్రి పదవి చేపడతానన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రానున్న పదేళ్లకాలంలో దేశాన్ని సూపర్ పవర్ చేయటంతోపాటు భారత ఆర్థిక అభివృద్ధి విధానాన్ని ప్రపంచం ముందు పెడతామని చెప్పారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా చేసేందుకు ప్రతి జిల్లాలో ఒక ఫుడ్ పార్క్‌ను ఏర్పాటు చేస్తాము, రైతులు తమ ఉత్పత్తులను నేరుగా ఫుడ్ పార్క్‌లకు విక్రయిస్తారని ఆయన చెప్పారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటామంటూ గతంలో రైతుల రూ. 60 కోట్ల రుణాలను మాఫీ చేసినట్లే ఇక ముందు కూడా అలాంటి చర్యలు చేపడతామని ప్రకటించారు. విద్యావిధానాన్ని పూర్తిగా మార్చివేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. చైనాతో పోటీ ఉన్నది, ద్వేషంతో కాకుండా ప్రేమతో పోటీ పడదామని ఆయన సూచించారు. దేశంలోని ప్రతి జిల్లాలో ఏదోఒక నైపుణ్యం ఉంటుంది, దానిని ప్రోత్సహించాలన్నారు.
దేశంలో నైపుణ్యానికి లోటు లేదు అయితే నైపుణ్యం ఉన్న వారిని ప్రోత్సహించటం, రుణాలు ఇప్పించటం మన బాధ్యత అని రాహుల్ పేర్కొన్నారు. ప్రతి జిల్లాలోని నైపుణ్యానికి బ్యాంకు రుణాలు, సాంకేతిక పరిజ్ఞానంతో జోడించాలన్నారు. దేశంలోని ప్రతి ప్రాంతంలో ఫుడ్‌పార్క్‌ల నెట్ వర్క్ ఏర్పాటు చేయాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులను భద్రత చేకూరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉన్నత విద్యను దేశంలోని నలుమూలల వ్యాపిస్తాం. సమాజంలోని ప్రతి వర్గానికి కూడా ఐఐటి లాంటి విద్యను అందజేస్తామన్నారు.