జాతీయ వార్తలు

‘నవకళేబర్’ సందర్భంగా నాణేల విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూరీ, మార్చి 18: పూరీ జగన్నాధుడి నవకళేబర్ పండుగను పురస్కరించుకొని రాష్టప్రతి రామ్ నాథ్ కోవింద్ రూ.10, రూ.1000 నాణేలను విడుదల చేశారు. పూరీలో నిర్వహించిన రాష్ట్రీయ సంస్కృత్ సంస్థాన్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా ఆయన ఈ నాణేలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పురాతన కాలంనుంచి పూరీ ‘విద్యా నగరం’గా భాసిల్లిందన్నారు. హిందువుల నాలుగు ‘్ధమ్’లలో పూరీ కూడా ఒకటి అన్నారు. శంకరాచార్యుడు, కేరళలో జన్మించినప్పటికీ సంస్కృతాన్ని నేర్చుకొని, ఉత్తరాఖండ్, పూరి, ద్వారక, రామేశ్వరంలలో నాలుగు పీఠాలు స్థాపించాడని, అందువల్లనే ఇది పై నాలుగింటిలో ఒక ‘్ధమ్’గా రూపొందిందన్నారు. భగవాన్ పూరీ జగన్నాధుడి సేవకోసం ఆదిగురు శంకారాచార్య, రామానుజుడు, చైతన్య, గరునానక్‌లు పూరీలో వారి మఠాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. పూరి తూర్పు ప్రాంత భారతీయులకు ‘కాశీ’ వంటిదన్నారు. తనకు 8-9 ఏళ్ల వయసులో 1947, అక్టోబర్ 9న తన తండ్రి, పూరీ జగన్నాథుడి దర్శనం చేసుకున్నారని, ఇన్నాళ్లకు మళ్లీ తాను జగన్నాథుడిని దర్శించుకోవడం నిజంగా తన అదృష్టమన్నారు.

చిత్రం..ఆదివారం పూరీలో నాణేలు విడుదల చేస్తున్న రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు