జాతీయ వార్తలు

‘పద్మ’ అవార్డుల్లో ఇక ప్రతిభకే పట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 18: 2018 పద్మ అవార్డులకు 8 రాష్ట్ర ప్రభుత్వాలు, ఏడుగురు గవర్నర్లు, 14 మంది కేంద్ర మంత్రులు సిఫారసు చేసిన వారిలో ఒక్కరూ ఈ అవార్డులకు ఎంపిక కాకపోవడం ఈసారి విశేషం. ఈ అవార్డుకు విజేతల వివరాలను జనవరి 25న ప్రకటించగా, మార్చి 20, ఏప్రిల్ 2 తేదీల్లో విజేతలకు అందజేస్తారు. హోంమంత్రిత్వశాఖ వివరాల ప్రకారం 2018 సంవత్సరానికి పద్మ అవార్డులకోసం మొత్తం 35,595 నామినేషన్లు లేదా సిఫారసులు అందాయి. ఇందులో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, కేంద్ర సహాయ మంత్రులు, మాజీ పద్మ అవార్డు గ్రహీతలు, వ్యక్తులు, సంస్థలు సిఫారసు చేసినవారున్నారు. ఈ మొత్తంలో కేవలం 84 మంది పేర్లు మాత్రమే షార్ట్‌లిస్టయ్యాయి. మొత్తం 10 మంది సభ్యులతో కూడిన ఎంపిక కమిటీ ‘గుర్తింపునకు నోచని ప్రముఖులను’ ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది. తమిళనాడు (6), హర్యానా(5), జమ్ము-కశ్మీర్ (9), కర్నాటక (44), ఉత్తరాఖండ్ (15), బిహార్ (4), రాజస్థాన్ (4), ఢిల్లీ (7) రాష్ట్ర ప్రభుత్వాల సిఫారసులను కమిటీ తిరస్కరించింది.
ఏడుగురు గవర్నర్ల సిఫారసులు కూడా చెత్తబుట్ట దాఖలయ్యాయి. వీరిలో పశ్చిమ బెంగాల్ కేసరినాథ్ త్రిపాఠి (11), హర్యానా కెప్టెన్ సింగ్ సోలంకి (7), జమ్ము-కశ్మీర్ ఎన్.ఎన్. ఓరా (4), ఉత్తర ప్రదేశ్ రామ్‌నాయక్ (10), గుజరాత్ ఓపీ కోహ్లీ (2), కేరళ పి. సథాశివమ్ (2), పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ (1) పద్మా పురస్కారాల్లో స్థానం సంపాదించలేదు. అదేవిధంగా ఏడుగురు కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ (1), మేనకా గాంధీ (4), ప్రకాశ్ జవదేకర్ (6), రామ్ విలాస్ పాశ్వాన్ (4), సురేశ్ ప్రభు (12), థవర్ చంద్ గెహ్లాట్ (16) కూడా స్థానం పొందలేకపోయాయి. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఒరమ్ సిఫారసు చేసిన పదింటిలో ఒక్కరిని కమిటీ అవార్డుకు ఎంపిక చేసింది. ఇక ఎనిమిది మంది సహాయమంత్రుల సిఫారసులను కూడా కమిటీ పక్కన పెట్టింది.
ఇక వివిధ రాష్ట్రాల గవర్నర్లు పంపిన సిఫారసుల్లో కొందరివి ఆమోదం పొందాయి. వీటిలో అస్సాం (1/12), ఛత్తీస్‌గఢ్ (1/13), ఉత్తర ప్రదేశ్ (1/7), మధ్యప్రదేశ్ (1/9), కేరళ (1/41), మహారాష్ట్ర (3/84) ఉన్నాయి. కాగా గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ సిఫారసు చేసిన రెండు పేర్లు తిరస్కరణకు గురికాగా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ సిఫారసు చేసిన ఎనిమిదింటిలో ఒకదానికి స్థానం లభించింది. ఈ ఏడాది రాష్టప్రతి, పద్మ పురస్కారాలకోసం 84 పేర్లకు ఆమోదం తెలిపారు. వీరిలో పద్మ విభూషణ్ (3), పద్మభూషణ్ (9), పద్మశ్రీ (72). పదిమంది ఎంపిక కమిటీతో పాటు, కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులకోసం 19 మంది సభ్యుల అంతర్-మంత్రిత్వశాఖల సెర్చ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.