జాతీయ వార్తలు

బందీలను చంపేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ, మార్చి 20: భయపడిందే జరిగింది... ఏదైతే కాకూడదని యావద్భారతం మనసా వాచా కాంక్షించిందో అదే జరిగిపోయింది. నాలుగేళ్ల క్రితం ఇస్లామిక్ ఉగ్రవాదులు బందీలుగా చేజిక్కించుకున్న 39మంది అమాయక భారతీయులు ఆ ఉగ్ర మూకల పైశాచికత్వానికి బలైపోయారు. యావద్భారతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ అమానుష చర్యకు సంబంధించి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం రాజ్యసభలో ప్రకటించారు. ‘ఐసిస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన మొత్తం 40 మందిలో ఒక వ్యక్తి తప్పించుకోగలిగాడు. మిగిలిన వారిని ఉగ్రవాదులు
చంపేశారు’ అని స్పష్టం చేశారు. 39 మంది మృతదేహాలను ఒక సమాధి నుంచి వెలికి తీసి డిఎన్‌ఎ నమూనాలు పరీక్షించగా వారంతా హత్యకు గురైనట్టు తేలిందని ఆమె వివరించారు. ఈ ఘాతుకానికి పాల్పడింది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులన్నారు. ‘మృతదేహాల శరీర నమూనాలను బాగ్దాద్‌కు చేర్చి, నిర్ధారణకోసం వారి బంధువుల డిఎన్‌ఎ నమూనాలను ఇరాక్‌కు పంపామన్నారు. కాగా 39 మృతదేహాల డిఎన్‌ఎ నమూనాలు వారి బంధువుల డిఎన్‌ఏ నమూనాలకు సరిపోయాయి. మరో వ్యక్తిది మాత్రం 70 శాతం సరిపోయిందని’ అమె రాజ్యసభకు వివరించారు. ఈ దురాగతాన్ని భారమైన హృదయంతో సభకు వెల్లడిస్తున్నానన్నారు. హతులు పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాలకు చెందినవారు.
మాజీ ఆర్మీ ఛీఫ్, ప్రస్తుత కేంద్ర మంత్రి వి.కె. సింగ్ ఇరాక్ వెళ్లి, 39 మంది శరీర అవశేషాలను భారత్‌కు తీసుకువస్తారని సుష్మా తెలిపారు.
‘శరీర అవశేషాలను తీసుకొచ్చే విమానం మొదట అమృత్‌సర్, తర్వాత పాట్నా, కోల్‌కతాలకు వెళుతుంది’ అన్నారు.
స్పష్టమైన రుజువులు లేకుండా వారందరూ మరణించారని ప్రకటించడానికి గతంలో సుష్మా స్వరాజ్ అంగీకరించలేదు. ఆవిధంగా చెప్పడం ‘పాపం’ అవుతుందన్నారు. సభను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ లోక్‌సభలో సభ్యులు చేసిన ఆరోపణలకు ఆమె స్పందిస్తూ, ‘ఏవిధమైన రుజువులు లేకుండా ఎవరైనా మరణించారని చెప్పడం పాపం’ అని పేర్కొన్నారు.
భారతీయులకోసం చూడటం ప్రభుత్వ విధి. కానీ ఈ విషయంలో ‘మృతదేహాలు లేవు, రక్తం మరకలు లేవు, జాబితాలేదు, ఐఎస్‌ఐఎస్ విడియోలు లేవు’ అన్నారు.
2014లో వౌసల్ పట్టణాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్న సమయంలో ఐసిస్ ఉగ్రవాదులు 40 మంది భారతీయ కూలీలను బందీలుగా పట్టుకున్నారు. వీరు వౌసల్‌నుంచి బయటపడేందుకు యత్నిస్తుండగా ఉగ్రవాదులు వీరిని అడ్డగించి తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
వీరిలో గురుదాస్‌పూర్‌కు చెందిన హర్జిత్ మసిహ్ మాత్రం తప్పించుకున్నాడు. వీరందరిని ఉగ్రవాదులు హతమార్చడం తాను కళ్లారా చూశానని చెప్పాడు. అయితే భారత ప్రభుత్వం అతను చెప్పే విషయాన్ని ఖండించి, ఆచూకీ తెలియనివారికోసం యత్నిస్తున్నట్టు ప్రకటించింది. ఇరాక్ దళాలు వౌసల్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్న తర్వాత, వీరి ఆచూకీ కోసం భారత ప్రభుత్వం ఇరాక్ సర్కార్ సహాయం కోరింది.

చిత్రాలు..మంగళవారం రాజ్యసభలో ప్రకటన చేస్తున్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్
*రాజ్యసభలో సభ్యుల సంతాపం