జాతీయ వార్తలు

పట్టిందే పట్టు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 20: అవిశ్వాస తీర్మానం విషయంలో ప్రభుత్వం ఎంత పట్టుదలతో వ్యవహరిస్తోందో అంతే పట్టుదలను ప్రతిపక్షం కూడా ప్రదర్శిస్తోంది. ఎన్‌డీఏ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా చేస్తుంటే.. ప్రతిపక్షం పట్టువదలని విక్రమార్కుడి మాదిరిగా ప్రతిరోజు కొత్తగా అవిశ్వాస తీర్మానాలను ప్రతిపాదిస్తోంది. లోక్‌సభలో తెలుగుదేశం పక్షం నాయకుడు తోట నరసింహం, వైఎస్‌ఆర్‌సీపీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మంగళవారం మరోసారి అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. ఇరువురు నాయకులు మంగళవారం అవిశ్వాస తీర్మానం నోటీసులను లోక్‌సభ సెక్రెటరీ జనరల్‌కు విడివిడిగా అందజేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగేంతవరకు నోటీసులు ఇస్తూనే ఉంటామని
బడ్జెట్ సమావేశాల ఆఖరు రోజు వరకు నోటీసుల పరంపర కొనసాగుతుందని రెండు పార్టీల నాయకులు చెబుతున్నారు.
విమర్శిస్తూ..మద్దతు అడుగుతారా?
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని అన్యాయం ఏర్పాటు చేశారంటున్న తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సీపీ అవిశ్వాస తీర్మానాలకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల సాధనకోసమే పోడియం వద్దకు వెళుతున్నామని వారంటున్నారు. తెలుగుదేశం సభ్యులు ప్రతిరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును విమర్శిస్తున్నారు, రాష్ట్ర విభజన అశాస్ర్తియంగా జరిగిందని ఆరోపిస్తున్నారు.. ఇది మంచిది కాదని వారు స్పష్టం చేశారు.