జాతీయ వార్తలు

ఇది జాతీయ విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 20: ఇరాక్‌లో బందీలుగా ఉన్న 39 భారతీయుల మృతి వార్తపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారు ఎప్పటికైనా తిరిగి వస్తారని స్వదేశంలో ఎదురుచూస్తున్న ఆప్తులకు ఇదెంతో కడుపుకోతను మిగిల్చిందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రాజ్యసభలో కాంగ్రెస్ పక్షనేత గులామ్ నబీ ఆజాద్ ఇరాక్ ఘటనపై మాట్లాడుతూ అదొక జాతీయ విషాదం అంటూ తీవ్ర ఆందోళన ప్రకటించారు. ‘ఇరాక్‌లో 39 భారతీయులు ఐస్ ముష్కరుల చేతిలో చనిపోయారన్న వార్త నన్ను షాక్‌కు గురిచేసింది. 2014 నుంచి మెసూర్‌లో బందీలుగా ఉన్నవారు ఎప్పటికైనా తిరిగి వస్తారని మృతుల బంధువులు ఆశించారు’ అంటూ రాహుల్ స్పష్టం చేశారు. ఇప్పుడు వారు లేరన్న వార్త కుటుంబాల్లో పెనువిషాదమేనని కాంగ్రెస్ అధినేత అన్నారు. 39 మంది కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతూ రాహుల్ ట్వీట్ చేశారు. ఇది యావత్ భారతీయులకు విషాద వార్తే అని రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత ఆజాద్ అన్నారు. ఇరాక్‌లో చిక్కుకున్న భారతీయుల యోగక్షేమాల గురించి ఏడాది పార్లమెంటులో ఒత్తిడి చేయగా వారంతా క్షేమంగానే ఉన్నారని కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ చెప్పిందని, తీరా ఇప్పుడు చనిపోయినట్టు వెల్లడించడం బాధాకరమని ఆయన తెలిపారు. ఈ ఘటనలో విదేశాంగ శాఖ తీరును దారుణంగా ఉందని సీపీఎం ఎంపీ సబామహ్మద్ సలీం విమర్శించారు. మెసూల్ ఊచకోతపై విదేశాంగ మంత్రి సుష్మా ఎందుకంత రహస్యం పాటించాల్సి వచ్చిందని ఆయన నిలదీశారు.