జాతీయ వార్తలు

దేశ ప్రజలను అవమానిస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదుబిద్రే (కర్నాటక): భారత ప్రగతికి తామే కారణమంటూ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను ‘‘అవమానిస్తున్నారు’’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో, ఆయన మూడోసారి కర్నాటక రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెద్ద వ్యాపారవేత్తలకు రుణాల మాఫీ ప్రకటించిన మోదీ, రైతులను మరచారంటూ విమర్శించారు. ‘‘ఎక్కడికి వెళ్ళినా ఆయన గత 70 ఏళ్లకాలంలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదంటూ మా తల్లిదండ్రులను, పేద రైతులను, శ్రామికులను, చిరు వ్యాపారులను అవమానిస్తున్నారు’’ అన్నారు. ‘‘ఇవ్వాళ దేశం ప్రపంచంలోని ఇతర దేశాలతో సమానంగా నిలబడిందంటే అది కేవలం రెండేళ్లలో జరిగింది కాదు. అందుకు ఎన్నోఏళ్ల సమయం పట్టింది. సామాన్యులు చెమట, రక్తం చిందిస్తే కాని అది సాధ్యం కాలేదు. అందువల్ల మోదీ సామాన్యులను అవమానించడం మానుకోవాలి’’ అని, ఉడిపి జిల్లాలోని పదుబిద్రేలో మంగళవారం నిర్వహించిన ర్యాలీలో విమర్శించారు. ఏదో ఒక వ్యక్తి వల్ల దేశం ముందుకు పోవడం సాధ్యంకాదన్నారు. భాజపా ప్రజలను విడదీస్తోందన్నారు. ‘్భజపా వారు ఎక్కడికెళ్లినా ధర్మం గురించి మాట్లాడతారు. కానీ ప్రజలను ఒకరికి వ్యతిరేకంగా మరొకరిని ఎగదోయడం వారి నైజం’ అన్నారు. ఒకవైపు సామాజిక సంస్కర్తలైన బసవన్న, నారాయణగురులను పొగడుతారు. మరోపక్క ఈ రెండు వర్గాల మధ్య చిచ్చుపెడతారంటూ ఆరోపించారు.
రాష్ట్ర దక్షిణ కోస్తా, మల్నాడు ప్రాంతాల్లో రాహుల్ తన పర్యటన కొనసాగిస్తున్నారు. నిరర్ధక ఆస్తులకు కారణం మోదీ ప్రభుత్వమేనన్నారు. మేం బ్యాంకులను గ్రామాలకు తీసుకెళ్లాం. కానీ నేడు చూడండి. ధనికుల వద్ద లక్షలకోట్ల రూపాయల నిరర్ధక ఆస్తులు పడివున్నాయి. దాదాపు 10-15 మంది ధనికులు గత కొద్ది సంవత్సరాల్లో రూ.8 లక్షల కోట్లు కొల్లగొట్టారు. మరి భాజపా 15 మంది ధనికులకు రూ. 2.5 లక్షల కోట్ల మేర రుణాలు రద్దు చేసింది. మరి ఒక రైతు రుణమాఫీ గురించి అడిగితే మోదీ, జైట్లీలు అది విధానం కాదంటారు అంటూ విమర్శించారు. గాంధీ తన పర్యటనలో భాగంగా వివిధ ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తున్నారు. గోకర్నాధేశ్వర దేవాలయం, రొసాయిరో చర్చి, ఉల్లాల్ దరాకి, శృంగేరి శారదాంబ దేవాలయం, శృంగేరి మఠం ఆయన సందర్శించిన ప్రదేశాల్లో ఉన్నాయి. అంతేకాదు ఆయన శృంగేరీ పీఠాధిపతి శంకరాచార్యను కూడా కలుసుకున్నారు. రాష్ట్రంలో ఏప్రిల్-మే నెలల్లో బహుశా అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముంది.

చిత్రం..ఉడిపిలోని మత్స్యకార కుటుంబ సభ్యులతో సహపంక్తి భోజనం చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, సీఎం సిద్దరామయ్య