జాతీయ వార్తలు

మోదీ సర్కార్‌కు పరాజయం తథ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిక్‌మగళూరు, మార్చి 21: వచ్చే సాధారణ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వానికి ఓటమి తప్పదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అసలు ‘్ధర్మం’ అంటే నిజమైన అర్థం ఏమిటో ప్రధానికి తెలియదని పేర్కొన్నారు. కాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని జోస్యం చెప్పారు. ‘ మోదీ పాలన ప్రారంభమై నాలుగేళ్లు గడిచింది. ఇన్నాళ్లూ ఆయన సుదీర్ఘ ప్రసంగాలతోనే సరిపోయింది. నేను అధికారంలోకి రావడానికి ఏడాది సమయముంది. రాబోయే ఎన్నికల్లో మోదీ విజయం సాధించడం కల్ల’ అని రాహుల్ అన్నారు. కర్ణాటకలో వరుసగా రెండో రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఆయన మోదీపైనే విమర్శలు ఎక్కు పెట్టారు. ‘్భరత ప్రజలు ప్రధాని నుంచి నిజం మాత్రమే ఆశిస్తారు. అంతేకాని విషం చిమ్మే ప్రసంగాలను కాదు’ అన్నారు. ‘ప్రేమ, సహోదరత్వాన్ని చాటే ప్రసంగాలు వినాలనుకుంటాను. నిజం అనేది లేకుండా దేశం ముందుకు పోదన్న సంగతి వారికీ తెలుసు. అందువల్ల సత్యమేవ జయతే మాత్రమే ధర్మానికి పునాది’ అన్నారు. తర్వాత ఆయన శృంగేరి శారదాపీఠాన్ని సందర్శించారు. క్రీ.శ. 8వ శతాబ్దంలో జగద్గురు శంకరాచార్య ప్రతిష్ఠించిన నాలుగు పీఠాల్లో ఇదికూడా ఒకటి. కాగా రాహుల్ గాంధీ శ్రీ భారతీ తీర్థస్వామిని కలుసుకున్నారు. శృంగేరీ సంస్కృత విశ్వవిద్యాలయంలో ‘్ధర్మానికి’ 14 సంవత్సరాల బాలుడు ఇచ్చిన నిర్వచనాన్ని రాహుల్ ఎంతో ప్రశంసించారు. ‘సత్యమేవ జయతే’ అనేదే ధర్మానికి ఆధారమని ఆ బాలుడు చెప్పాడని, ఇది నరేంద్ర మోదీకి తెలియదన్నారు. ప్రధాని హృదయం ప్రేమ, సహానుభూతితో నిండినప్పుడు మాత్రమే ఆయన విజయం సాధించగులుగుతారన్నారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఎన్నడూ, తనకంటే ముందు భారత్‌లో ఏమీ జరగలేదన్న మాట మాట్లాడలేదన్నారు. చైనా డోక్లామ్‌లో తిష్ఠవేసింది. దక్షిణ డోక్లామ్‌కు చేరుకునేందుకు కొత్త మార్గాన్ని నిర్మిస్తోంది. నిజంగా చైనా వౌనంగా తెలివిగా తనపని తాను చేసుకుపోతోంది. కానీ దానిపై నరేంద్ర మోదీ ఒక్క మాట కూడా మాట్లాడరంటూ విమర్శించారు. చైనా అక్కడ రోడ్లు, హెలిప్యాడ్లు, విమానాశ్రయం వంటివి నిర్మిస్తోంది. ఇది దేశానికంతా తెలిసిందేనన్నారు.