జాతీయ వార్తలు

‘భూగర్భ గనుల్లో పనిచేసేందుకు మహిళలకూ అవకాశం కల్పించండి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 22: భూగర్భ గనుల్లో మహిళలు పని చేసేందుకు అడ్డంకిగా మారిన 1942 గనుల చట్టాన్ని సవరించాలని టీఆర్‌ఎస్ ఎంపీ బి.వినోద్‌కుమార్ కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్‌కు విజ్ఞప్తి చేశారు. వినోద్‌కుమార్ గురువారం గంగ్వార్ కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రాన్ని అందజేశారు. ప్రస్తుత చట్టంలో ఉన్న ఒక్క లోపం మూలంగా భూగర్భ గనుల్లో మహిళలకు ఉపాధి లభించటం లేదని ఆయన మంత్రికి వివరించారు. యువతులు మైనింగ్ ఇంజనీరింగ్, డిప్లొమా కోర్సులు చదివేందుకు అనుమతించిన మనం.. వారు భూగర్భ గనుల్లో పనిచేయకుండా ఆపటం ఏమిటని వినోద్‌కుమార్ ప్రశ్నించారు. మహిళలు ఉపరితల గనుల్లో పని చేయటంపై కూడా పలు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు. గనుల రంగంలో పురుషులతో పాటు మహిళలకు కూడా సమాన అవకాశాలు కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు వినోద్‌కుమార్ తెలిపారు.