జాతీయ వార్తలు

అవిశ్వాసం.. తీర్మానాలకే పరిమితం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: లోక్‌సభలో గురువారం ఐదోరోజు కూడా అవిశ్వాస తీర్మానం చర్చకు రాలేదు. సభ ఆర్డర్‌లో లేనందువల్ల అవిశ్వాస తీర్మానాలను సభ ముందు ప్రతిపాదించలేకపోతున్నానని స్పీకర్ సుమిత్రా మహాజన్ చెప్పారు. అప్పటికే పోడియంను చుట్టుముట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి, అన్నా డీఎంకే సభ్యులు సభ దద్దరిల్లేలా నినాదాలు ఇస్తూ సభా కార్యక్రమాలను స్తంభింపజేశారు. కావేరీ జలాల నిర్వహణకు బోర్డును ఏర్పాటు చేయాలని అన్నా డీఎంకే సభ్యులు, ఎస్టీ రిజర్వేషన్లు పెంచాలంటూ టీఆర్‌ఎస్ సభ్యులు నినదించారు. అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు ప్రతిపాదించటం తన విద్యుక్త ధర్మం. అయితే సభ్యులు ఇలా పోడియం వద్ద నిలబడి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలిస్తే తానెలా పని చేయగలనని సుమిత్రా మహాజన్ పలుమార్లు చెప్పారు.
లోక్‌సభ పదకొండు గంటలకు సమావేశం కాగానే సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే పోడియంను చుట్టుముట్టిన అన్నా డీఎంకే, టీఆర్‌ఎస్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్దఎత్తున నినాదాలు ఇవ్వటంతో సభ దద్దరిల్లింది. సభ తిరిగి 12 గంటలకు సమావేశమైనప్పుడు సుమిత్రా పహాజన్ ప్రభుత్వ పత్రాలను సభకు సమర్పింపజేసి, వాయిదా తీర్మానాలను తిరస్కరించినట్లు ప్రకటించారు. దానితో కాంగ్రెస్ తదితర ప్రతిపక్షం సభ్యులు లేచి వాయిదా తీర్మానాలు తిరస్కరించటం అన్యాయమంటూ నిరసన తెలిపారు. ఇంతలో అకాలీదళ్ సభ్యుడు చందు మాజ్రా మాట్లాడేందుకు స్పీకర్ అవకామిచ్చారు. స్వాతంత్య్ర సమర యోధుడు సర్దార్ భగత్‌సింగ్ మార్చి 23న బ్రిటిష్ పాలనను వ్యతిరేకిస్తూ పార్లమెంట్ సెంట్రల్ హాల్‌పై బాంబు వేశారు.. అందుకే మార్చి 23ను సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం తెలుగుదేశం పక్షం నాయకుడు తోట నరసింహం, వైఎస్‌ఆర్‌సీపీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాల గురించి ప్రస్తావించారు. అయితే సభ్యుల గొడవ మూలంగా అవిశ్వాస తీర్మానాన్ని బలపరుస్తున్న యాభై మందిని లెక్కించలేకపోతున్నానని స్పీకర్ పలుమార్లు ప్రకటించారు. పోడియం వద్ద గుమిగూడిన సభ్యులందరూ తమ సీట్లలోకి వెళ్లిపోవాలని సూచించారు. ప్రతిపక్షం నాయకుడు మల్లికార్జున ఖర్గే లేచి తామంతా అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. సభ ఇలా అదుపు తప్పితే అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపటం తనకు ఎంతమాత్రం సాధ్యం కాదని స్పీకర్ స్పష్టం చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత కుమార్ లేచి అవిశ్వాస తీర్మానంతోపాటు ప్రతిపక్షాలు ప్రతిపాదించే ప్రతి అంశంపై చర్చ ఇరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ప్రకటించారు. ఇవేమీ లెక్కచేయకుండా అన్నా డీఎంకే, టీఆర్‌ఎస్ సభ్యులు నినాదాలిస్తూ సభను స్తంభింపజేశారు, దీనితో సుమిత్రా మహాజన్ సభను శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు వాయిదా వేశారు.
మళ్లీ నోటీసులు
తెలుగుదేశం పక్షం నాయకుడు తోట నరసింహం, వైఎస్‌ఆర్‌సీపీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి గురువారం మోదీ మంత్రి వర్గంపై మళ్లీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు.