జాతీయ వార్తలు

రాజ్యసభలో ఆగని నిరసనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 22: రాజ్యసభలో నినాదాలు మిన్నుముట్టి సభా కార్యక్రమాలు సాగక పోవడంతో చైర్మన్ వెంకయ్య నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సభ ప్రారంభం కాగానే వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పత్రాలను సభకు సమర్పింపజేశారు. ఇటీవల లోక్‌సభలో పాసైన 2018 గ్రాట్యుటీ బిల్లును విపక్ష సభ్యుల సహకారంతో బిల్లు పాస్ చేశారు. అనంతరం తెలుగుదేశం సభ్యుడు సీఎం రమేష్ ఏపీ అంశంపై మాట్లాడేందుకు చైర్మన్ అవకాశం ఇచ్చారు. రమేష్ మాట్లాడుతూ విభజన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని పేర్కొన్నారు. నాలుగేళ్లు గడిచినప్పటికీ విభజన హామీలు అమలు చేయలేదని అన్నారు. ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు.. పది సంవత్సరాలు కావాలని రాజ్యసభలో అప్పటి ప్రతిపక్షం బీజేపీ విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తుచేశారు. విభజనవల్ల రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది.. తలసరి ఆదాయం తక్కువైపోయింది.. కేంద్రమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం తెలుగుదేశం ఎంపీలు, అన్నా డీఎంకే, కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. ఏపీ విభజన హామీలను అమలు చేయాలని సీఎం రమేష్, గరికపాటి మోహన్‌రావు, తోట సీతారామలక్ష్మీ, టీజీ వెంకటేష్, కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు పోడియం వద్దకు చేరుకుని ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు. అలాగే అన్నాడీఎంకే, డీఎంకే సభ్యులు కావేరీ జలాల బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీ అంశంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలపారు. ఈ నిరసనలపట్ల చైర్మన్ వెంకయ్య నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడియం వద్ద ప్లకార్డు ప్రదర్శిస్తున్న సీఎం రమేష్‌ను ఉద్దేశించి- ‘తన ముందు ప్లకార్డును ప్రదర్శించవద్దు’ అంటూ గట్టిగా హెచ్చరించారు. ఎంపీల అసభ్య ప్రవర్తన ప్రజల దృష్టికి వెళ్లకూడదనే ఉద్దేశంతోనే సభను వాయిదా వేస్తున్నట్టు వెంకయ్య స్పష్టం చేశారు. ఇలా పోడియం వద్దకు వచ్చి ప్లకార్డులతో నిరసన తెలిపితే సభను నడపలేనంటూ శుక్రవారానికి వాయిదా వేశారు.

చిత్రం..రాజ్యసభలో గురువారం పోడియం వద్దకు వచ్చి నినాదాలిస్తున్న సభ్యులను వారిస్తున్న వెంకయ్య