జాతీయ వార్తలు

రేపటి నుంచే ‘స్మార్ట్ సిటీ’ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 23: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన ‘స్మార్ట్ సిటీ పథకం’లో చోటు దక్కించుకున్న 20 నగరాల్లో పనులను ఈ నెల 25న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లాంచనంగా ప్రారంభిస్తారు. పుణేలో 5000 సీటింగ్ సామర్థ్యం కలిగిన శివ్ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంతో ‘స్మార్ట్ సిటీ మిషన్’ పథకం పనులు అమలులోకి రానున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పునెలో అదే రోజున 14 ప్రాజెక్టు పనులు ప్రారంభించడంతోపాటు, మిగతా నగరాల్లో 69 ఇతర పనులు ప్రారంభవుతాయని, వీటన్నిటినీ ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారని తెలిపింది. ‘స్మార్ట్ సిటీ చాలెంజ్ కాంపిటిషన్’లో తొలివిడతలో గెలుపొందిన 20 నగరాల్లో ఈ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 25న ప్రారంభం కానున్న పనులకు దాదాపు 1,770కోట్ల రూపాయలు వ్యయం కానున్నట్లు అంచనా. ఈ పనుల్లో స్వచ్ఛ భారత్ మిషన్ కింద వేస్ట్ మేనేజ్‌మెంట్, ముగురు నీటి పారుదల ప్లాంట్లతోపాటు అటల్ మిషన్ ఫర్ రెజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్‌మేషన్ కింద పచ్చదనం-పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు ఉంటాయి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద పట్టణాల్లోని పేదలకు ఇళ్లను నిర్మిస్తారు. ఈ కార్యక్రమాలతోపాటు ‘మేక్ యువర్ సిటీ స్మార్ట్’ పేరిట ప్రజల నుంచి స్మార్ట్ సిటీ డిజైన్లను ఆహ్వానిస్తారు. వీటిలో ఎంపికైన వారికి పదివేల నుంచి లక్ష రూపాయలకు వరకు బహుతులు అందజేస్తారు. అలాగే ‘స్మార్ట్ నెట్ పోర్టల్’ పథకాన్ని కూడా ఆవిష్కరిస్తారు. స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా ఎంపికైన 20 నగరాల్లో మొత్తం 48వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులను చేపడతారు. పునెలో జరిగే కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతోపాటు మహారాష్ట్ర గవర్నర్ సి.విద్యాసాగర్‌రావు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తదితరులు పాల్గొంటారు. మొదటి విడత ఎంపికైన స్మార్ట్ నగరాల్లో అహ్మదాబాద్ (గుజరాత్), భువనేశ్వర్ (ఒడిశా), జబర్‌పూర్ (మధ్యప్రదేశ్), జైపూర్ (రాజస్థాన్), కాకినాడ (ఆంధ్రప్రదేశ్), కొచ్చి (కేరళ), బేలాగవి (కర్నాటక) నగరాలున్నాయి.