జాతీయ వార్తలు

చంద్రయాన్-2 వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మార్చి 23: చంద్రయాన్-2 ప్రయోగం అక్టోబర్‌కు వాయిదా పడింది. వాస్తవానికి వచ్చేనెలలోనో చంద్రయాన్ 2ను ప్రయోగించాల్సి ఉంది. అయితే మరిన్న పరీక్షలు చేయాలని నిపుణులు నిర్ణయించిన నేపథ్యంలో ప్రయోగాన్ని వాయిదా వేసుకున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇటీవల ఇక్కడ సమావేశమైన నిపుణులు చంద్రయాన్-2పై చర్చించారని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చైర్మన్ కే శివన్ శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. ‘చంద్రయాన్-2 ఏప్రిల్‌లో ప్రయోగించడం లేదు. అక్టోబర్‌కు వాయిదా వేశాం’అని ఆయన స్పష్టం చేశారు. చంద్రయాన్-2 ఏప్రిల్‌లో ప్రయోగిస్తారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గతంలో ప్రకటించారు. దాని కోసం ఇస్రో అన్ని ఏర్పాట్లూ చేస్తోందని అంతరిక్ష వ్యవహారాలు చూస్తున్న సింగ్ తెలిపారు. అయితే 800 కోట్ల రూపాయలతో చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం ఏప్రిల్- నవంబర్ మధ్యలో ఉంటుందని శివన్ చెప్పారు. చంద్రయాన్-2 పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినట్టు ఇస్రో వెల్లడించింది. 3,290 కిలోల బరువైన ఈ అంతరిక్ష నౌక కక్ష్యలో తిరుగుతూ రిమోట్ సెన్సింగ్‌కు సంబంధించి సమాచారం అందిస్తోంది.