జాతీయ వార్తలు

సింగిల్ స్లాబ్ జీఎస్‌టీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైసూరు, మార్చి 24: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సింగిల్ జీఎస్‌టీ స్లాబ్ విధానం తీసుకొస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న ఐదు స్లాబ్‌ల స్థానే ఒకే స్లాబ్ విధానం అమలుచేస్తామని శనివారం ఇక్కడ ప్రకటించారు. 28 శాతం జీఎస్‌టీ స్లాబ్‌ను పూర్తిగా ఎత్తేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు తెలిపారు. మైసూరులోని మహారాణి కాలేజీలో విద్యార్థులతో రాహుల్ ముఖాముఖి పాల్గొన్నారు. సింగపూర్‌లో సింగిల్ జీఎస్‌టీ (7శాతం) విధిస్తూ ఫ్రీ హెల్త్‌కేర్ అమలుచేస్తుంటే ఇక్కడ 28 శాతం అంటే ఐదు అంచల విధానం ఏమిటని అఫ్రిన్ అనే విద్యార్థిని రాహుల్‌ను ప్రశ్నించగా ‘దీనికి ప్రధాని నరేంద్రమోదీనే సమాధానం చెప్పాలి. ఆయనే దీనికి సరైన వ్యక్తి’ అని బదులిచ్చారు. బహుళ స్లాబ్‌ల విధానం అవినీతిని ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు. అందుకే కాంగ్రెస్ ఒకే స్లాబ్ విధానానికి అనుకూలం అని రాహుల్ స్పష్టం చేశారు. ‘ప్రాథమికంగా జీఎస్‌టీ అన్నది కాంగ్రెస్ ఆలోచన. ఒకే స్లాబ్ విధానం ఉండాలన్నదే దాని ఉద్దేశం. అయితే బీజేపీ దాన్ని భ్రష్టుపట్టించింది. ఐదు రకాల స్లాబ్‌లతో ప్రజలపై పెనుభారం మోపింది’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు దుయ్యబట్టారు. ఏకంగా 28 శాతం పన్నులేస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘మోదీ సర్కార్ మార్కు జీఎస్‌టీని మేం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం’ అని ఆయన వెల్లడించారు. ‘మేం అనుకున్న జీఎస్‌టీకి బీజేపీ అమలుచేస్తున్న జీఎస్‌టీకి ఎక్కడా పొంతనలేదు’ అని ఆయన విమర్శించారు. అవినీతి ప్రోత్సహించడం అలాగే వ్యాపారులు పీడించడమే మోదీ ప్రభుత్వ లక్ష్యమని ఆయన ధ్వజమెత్తారు. విదేశాల నుంచి నల్ల ధనాన్ని రప్పిస్తానన్న మోదీ మాట తప్పారని రాహుల్ విరుచుకుపడ్డారు.