జాతీయ వార్తలు

తప్పుడు వైద్యానికి పది లక్షలు జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 23: తప్పుడు వైద్యం చేసినందుకు గానూ ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రికి, వైద్యుడికి రూ. 10లక్షలు చెల్లించాలని వినియోగదారుల ఫోరం ఆదేశించింది. ఓ మహిళకు తలలో ట్యూమర్ తొలగించటానికి తప్పుడు చికిత్స చేయటంతో తప్పనిసరిగా రెండోసారి సర్జరీ చేయాల్సిన పరిస్థితి కలిపంచటంతో ఆ మహిళ చనిపోయింది. దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ వినియోగదారుల వివాదాల పరిష్కారాల ఫోరమ్ జస్టిస్ ఎన్.కే.గోయల్ గురువారం తీర్పు చెప్పారు. మహిళ కుటుంబ సభ్యులకు అపోలో యాజమాన్యంతో పాటు, చికిత్స చేసిన వైద్యుడు సంయుక్తంగా రూ.10.5లక్షలు చెల్లించాలని ఆదేశించారు. 2002లో ఉత్తరాంచల్‌కు చెందిన చందాదేవి అనే మహిళ తలలో ట్యూమర్ రావటంతో చికిత్సకోసం అపోలోకు వచ్చారు. ట్యూమర్‌ను తొలగించటంలో అక్కడి వైద్యులు సరైన పద్ధతిలో వైద్యం చేయలేదు. వైద్యం వికటించటంతో దాదాపు రెండేళ్ల పాటు ఆమె తీవ్రంగా బాధపడ్డారు. తరువాత తప్పనిసరిగా రెండో (సర్జరీ గామా నైఫ్ రేడియో సర్జరీ) చేయాల్సి వచ్చింది. మెదడులో ట్యూమర్ ఉండటం వల్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన వైద్యులు వేద్యసేవలో లోపం చేశారని న్యాయమూర్తి స్పష్టం చేశారు. బాధితురాలి కుటుంబానికి జరగాల్సిన న్యాయాన్ని దృష్టిలో ఉంచుకుని రూ.10.5 లక్షలు చెల్లించాలని ఆదేశిస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.