జాతీయ వార్తలు

ఇక స్థిర, చరాస్తుల జప్తే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 24: దేశంలోని మాదక ద్రవ్య వ్యాపారస్తులపై ఉక్కుపాదం మోపుతామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. మాదక ద్రవ్య వ్యాపారస్తుల ఆస్తులను జప్తు చేయాలని, డ్రగ్ కార్టల్స్‌పై కఠినంగా వ్యవహరించాలని ఉద్ఘాటించారు. మాదక ద్రవ్య చట్టం అమలుపై శనివారం నాడిక్కడ జరిగిన మొట్ట మొదటి జాతీయ సదస్సునుద్దేశించి మాట్లాడిన ఆయన మాదక ద్రవ్య వ్యాపారాన్ని అన్ని కోణాల్లోనూ కట్టడి చేసేందుకు టెక్నాలజీ వినియోగం విస్తృతంగా జరుగుతోందని, అనేక ఏజెన్సీలు ఈ దిశగా పని చేస్తున్నాయని తెలిపారు. మాదక ద్రవ్య అక్రమ వ్యాపారం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలోకి నిధుల ప్రవాహాన్ని అరికట్టాలని, ఇందులో భాగంగా నార్కోటిక్స్ కేసులను క్షుణ్ణంగా విచారించాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. మాదక ద్రవ్య వ్యాపారస్తుల చిర, చరాస్థులను జప్తు చేయాలని, దీని వల్ల ఈ అక్రమ వ్యాపారం వెన్ను విరిచే అవకాశం ఉంటుందని అన్నారు. కేంద్రం, రాష్ట్రాలకు చెందిన మాదక ద్రవ్య నిరోధక ఏజెన్సీల అధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. మాదక ద్రవ్య నేరాలను అరికట్టేందుకు మరింత విస్తృత స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రాజ్‌నాథ్ ఉద్ఘాటించారు. ఏ ఒక్క ఏజెన్సీ కృషి వల్లో ఈ అక్రమ వ్యాపారం అంతమయ్యే అవకాశం లేదని, అన్ని ఏజెన్సీలు కలసికట్టుగా కృషి చేస్తేనే ఈ జాడ్యాన్ని రూపుమాపగలుగుతామని కేంద్ర హోం మంత్రి అన్నారు. సిండికేట్లు, కార్టల్స్ ఉమ్మడిగా నిర్వహించే మాదక ద్రవ్య వ్యాపారాన్ని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు సంబంధిత ఏజెన్సీలన్నీ కలసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సిండికేట్లను, వాటి సూత్రధారుల్ని గుర్తించి ఆస్తులను జప్తు చేస్తే తప్ప ఈ మహమ్మారిని వదిలించుకోలేమని అన్నారు. ఈ వ్యాపారం చేసే వారిని అరెస్టు చేయడం వంటివి..ఈ వ్యాపారాన్ని పూర్తిగా నిర్మూలించే దిశగా వేసే తొలి అడుగుగా రాజ్‌నాథ్ అభివర్ణించారు. మాదక ద్రవ్యాల సరఫరా, డిమాండ్లను పూర్తిగా అరికట్టే లక్ష్యంతోనే జాతీయ విధానాన్ని రూపొందించామని తెలిపారు. ఈ విషయంలో యువతలో చైతన్యాన్ని కలిగించి..మత్తు పదార్థాల నుంచి వారిని దూరం చేయాల్సిన అగత్యం కూడా ఎంతో ఉందని ఈ సందర్భంగా ఆయన ఉద్ఘాటించారు.