జాతీయ వార్తలు

ముసాయిదా నీటిమూటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తన డిమాండ్లపై ప్రభుత్వం రూపొందించిన ముసాయిదాను సామాజిక ఉద్యమ నాయకుడు అన్నా హజారే శనివారం తిరస్కరించారు. ఉన్నత స్థాయిల్లో అవినీతి నిరోధానికి లోక్‌పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్తలను ఏర్పాటు చేయాలన్న తన డిమాండ్లపై కేంద్రం రూపొందించిన ముసాయినా నిరుపయోగమని, తన నిరాహార దీక్షను ఆపేది లేదని ఆయన ఉద్ఘాటించారు. శుక్రవారం రామ్‌లీలా మైదానంలో మొదలైన హజారే దీక్షకు రెండో రోజైన శనివారం పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు. అయితే ఏడేళ్ల క్రితం ఆయన ఉద్యమానికి పెద్ద సంఖ్యలో వచ్చిన మధ్యతరగతి ప్రజలు ఈసారి పెద్దగా కనిపించక పోవడం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి తన డిమాండ్లపై ముసాయిదా అందిందని..అందులో పాత హామీలే తప్ప కొత్తగా చెప్పినవి ఏమీ లేవని, కనీసం హజారేను కలుసుకునేందుకు ఒక్క కేంద్ర మంత్రి కూడా రాలేదని ఈ ముసాయిదాను పరిశీలించిన టీమ్ హజారే కోర్ కమిటీ సభ్యుడు సుశీల్ భట్ అన్నారు. శుక్రవారం తన నిరవధిక నిరశన ప్రారంభం సందర్భంగా మాట్లాడిన హజారే అవినీతి నిరోధన, రైతుల సంక్షేమానికి సంబంధించి డిమాండ్లు పూర్తిగా నెరవేరే వరకూ వెనక్కి తిరిగేది లేదని స్పష్టం చేశారు. కేవలం పాత వాగ్దానాలతో జరిగే బుజ్జగింపు ప్రయత్నాలకు తలవంచేది లేదని, పూర్తిగా డిమాండ్లు నెరవేరే వరకూ ఉద్యమం ఆగదని తేల్చిచెప్పారు. కాగా, గతంలో కూడా హజారే ఉద్యమం సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వమూ లిఖిత పూర్వకంగా హామీలు ఇచ్చిందని, వాటిలో ఏదీ అమలు కాలేదని ఉద్యమ కార్యకర్త నరేంద్ర పాటిల్ అన్నారు. లోక్‌పాల్, లోకాయుక్తలతో పాటు దేశంలో వ్యవసాయ సంక్షోభాన్ని తొలగించేందుకు స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలన్నవి హజారే డిమాండ్లు..వాటిపై కేంద్ర ముసాయిదాను ఆయన తిరస్కరించిన నేపథ్యంలో తాజా ఉద్యమం ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.

చిత్రం..రామ్‌లీలా మైదానంలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ గాంధేయవాది, సామాజిక ఉద్యమ నేత అన్నా హజారే