జాతీయ వార్తలు

జైట్లీ వ్యాఖ్యలను తోసిపుచ్చిన స్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 23: భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి గురువారం కూడా ఆర్థిక శాఖలో ప్రధాన ఆర్థిక సలహాదారు అయిన అరవింద్ సుబ్రమణియన్‌పై దాడి కొనసాగించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. స్వయంగా అరవింద్ సుబ్రమణియన్‌ను వెనుకేసుకొచ్చినప్పటికీ సుబ్రహ్మణ్య స్వామి మాత్రం తన దాడిని ఆపలేదు. ‘ఆయన ఏమి చెప్పాలనుకుంటే అది చెప్పనివ్వండి. జైట్లీ చెప్పినదానిపై నేను చేసేదేమీ లేదు. నేను పార్టీ అధ్యక్షుడు లేదా ప్రధానమంత్రితో మాట్లాడతాను’ అని సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ విలేఖరులతో అన్నారు. అరవింద్ సుబ్రమణియన్‌పై మీరు చేసిన ఆరోపణలను అరుణ్ జైట్లీ తోసిపుచ్చారు కదా! అని విలేఖరులు ప్రస్తావించగా, సుబ్రహ్మణ్య స్వామి పైవిధంగా స్పందించారు. సుబ్రహ్మణ్య స్వామి గురువారం ఉదయం కూడా సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో అరవింద్ సుబ్రమణియన్‌పై తన దాడిని కొనసాగించారు.