జాతీయ వార్తలు

క్లాస్‌ఫోర్ ఉద్యోగానికి 34 మంది పిహెచ్‌డిలు దరఖాస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, జూన్ 23: దేశంలో నిరుద్యోగ సమస్య ఎంత దారుణంగా ఉందో తెలియజేసే సంఘటన ఇది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం నాలుగో తరగతి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా ఉన్నత విద్యావంతులు క్యూ కట్టేశారు. 34 మంది పిహెచ్‌డిలు, 12వేల మంది బిటెక్ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకున్నారు. ఫోర్త్ క్లాస్ ఉద్యోగాలకు పదో తరగతి విద్యార్హతలు కాగా పిజిలు అందులోనూ పిహెచ్‌డిలు, ఇంజనీర్లు పోటీ పడుతున్నారు. ఇలాంటి షాకింగ్ న్యూసే గత వారం మీడియాలో వచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూలీ / సహాయక్ పోస్టుల భర్తీకోసం ప్రకటన విడుదల చేస్తే పిజిలు, డిగ్రీలు, ఎంఫిల్ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కూలీ, సహాయక్ వంటి కింద స్థాయి ఉద్యోగాలకు కనీస విద్యార్హత నాలుగో తరగతి ఉత్తీర్ణత. ఉత్తరప్రదేశ్‌లో గత ఏడాది 368 ప్యూన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే 23 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారంటే దేశంలో నిరుద్యోగం తీవ్రత ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిరుద్యోగాన్ని పారదోలతామని అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం పనితీరుకు మధ్యప్రదేశ్ ఉదంతం మచ్చుతునక అని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం, బిజెపి పాలిత మధ్యప్రదేశ్ సర్కార్ ఘోరంగా విఫలమయ్యాయని ఆరోపించింది.