జాతీయ వార్తలు

ఇద్దరి క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించిన రాష్టప్రతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 23: జార్ఖండ్‌లో సుమారు తొమ్మిదేళ్ల క్రితం ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మందిని హతమార్చిన కేసులో దోషులయిన ఇద్దరు వ్యక్తులు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించారు. దోషులు మొఫిల్ ఖాన్, మొబారక్ ఖాన్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్టప్రతి తోసిపుచ్చినట్లు అధికారులు గురువారం తెలిపారు. 2007 జూన్‌లో లోహర్‌దగ జిల్లాలోని మకందు గ్రామంలో మసీదులో ప్రార్థనలు చేస్తున్న హనీఫ్ ఖాన్ అనే వ్యక్తిని ఈ ఇద్దరు మారణాయుధాలతో హతమార్చారు. ఆ తరువాత వారు హనీఫ్ భార్యను, ఆరుగురు కుమారులను కూడా హతమార్చారు. ఈ ఆరుగురిలో ఒకరు వికలాంగుడు కూడా ఉన్నారు. ఈ హత్యలకు సంబంధించి స్థానిక పోలీసులు మొఫిల్, మొబారక్, మరో ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. కేసును విచారించిన స్థానిక కోర్టు నిందితులను దోషులుగా నిర్ధారించడంతో పాటు వారందరికీ మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే జార్ఖండ్ హైకోర్టు మొఫిల్, మొబారక్‌ల మరణశిక్షను సమర్థించింది. కాని, మరో ఇద్దరికి విధించిన మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్పు చేసింది. సుప్రీంకోర్టు 2014 అక్టోబర్‌లో ఇచ్చిన తుది తీర్పులో దోషులకు విధించిన మరణశిక్షను సమర్థించింది. దీంతో దోషులు మొఫిల్, మొబారక్‌లు హోంమంత్రిత్వ శాఖ ద్వారా రాష్టప్రతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నారు. నిరుడు డిసెంబర్‌లో రాష్టప్రతి సచివాలయానికి అందిన ఈ క్షమాభిక్ష పిటిషన్‌ను ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించినట్లు అధికారులు వివరించారు.