జాతీయ వార్తలు

కర్ణాటక కాంగ్రెస్‌లో అసమ్మతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూన్ 23: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య తన మంత్రివర్గంలో చేసిన భారీ పునర్ వ్యవస్థీకరణతో రాష్ట్ర కాంగ్రెస్‌లో తలెత్తిన అసమ్మతి గురువారం తీవ్రమయింది. భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించేందుకు త్వరలోనే సమావేశం కావాలని అసమ్మతి నాయకులు నిర్ణయించారు. అవసరమైతే ప్రభుత్వ నాయకత్వాన్ని మార్చాలని కూడా వారు ఆలోచిస్తున్నారు. సిఎం సిద్ధరామయ్య ఆదివారం చేసిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో 14 మందిని తొలగించి, 13మందిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో మంత్రి పదవులు కోల్పోయిన వారిలో చాలా మందితోపాటు మంత్రి పదవిని ఆశించి దక్కించుకోలేక పోయినవారు గత రెండు రోజులుగా వరుస భేటీలు జరుపుతూ వస్తున్నారు. ‘ఆది లేదా సోమవారం మే ము సమావేశం అవుతాం. ఆ సమావేశంలో ఏం నిర్ణయం తీసుకున్నా అదే తుది నిర్ణయం అవుతుంది. మేమిప్పుడు ఒక అడుగు ముందుకు వేశాం. పార్టీని కాపాడుకోవడానికి, నాయకత్వ మార్పు అవసరం అయితే, దానికి కూడా మేము సిద్ధం’ అని యాదిగిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్కారెడ్డి గురువారం సమావేశానంతరం విలేఖరులకు చెప్పారు. నాయకత్వాన్ని మార్చకుండానే పార్టీని బలోపేతం చేయడమే తమ తొలి ఐచ్ఛికమని ఆయన అన్నారు. ‘తొలుత ఔషధాలు ఇస్తాం. సమస్య పరిష్కారం కాకుండే శస్తచ్రికిత్సకు కూడా సిద్ధం’ అని ఆయన అన్నారు.
అఫ్జల్‌పూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో ఎమ్మెల్యే మల్లికయ్య గుత్తెదార్ తనకు మంత్రి పదవి దక్కకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ‘అవసరమైతే నాయకత్వ మార్పుకోసం కూడా మేము నిర్ణయిస్తాం’ అని ఆయన అన్నారు. మరోవైపు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఈ అసమ్మతిని చల్లార్చడానికి తీవ్రంగా కృషి చేస్తోంది.