జాతీయ వార్తలు

మేమే తేలుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 23: కృష్ణా జలాల వినియోగంపై ఆంధ్ర, తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రులతో కేంద్ర జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి అమర్‌జీత్ సింగ్ గురువారం జరిపిన రెండో విడత చర్చలు కూడా విఫలమయ్యాయి. దీనితో కృష్ణానదీ నిర్వహణ బోర్డును రానున్న మూడు నెలల్లో అమలులోకి తెచ్చేందుకు అవసరమైన మార్గదర్శక సూత్రాలను సిద్ధం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముగ్గురు కేంద్ర జల సంఘం మాజీ అధ్యక్షులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తోంది. జూలై మొదటి వారంలో ఏర్పాటుకానున్న ఈ కమిటీ మార్గదర్శకాలను ఇచ్చేంతవరకు యథాతథ స్థితిని కొనసాగించాలని అమర్‌జీత్ సింగ్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు తెలంగాణ ఆమోదం తెలపగా, ఆంధ్రప్రదేశ్ తిరస్కరించింది. కృష్ణా బోర్డు మార్గదర్శక సూత్రాలను తయారు చేయించాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో బోర్డు ఇదివరకే పంపించిన ముసాయిదా నోటిఫికేషన్ వ్యవహారం మూలకు పడినట్లయింది.
రెండు రాష్ట్రాలు మంత్రులు గురువారం నాటి సమావేశంలోనూ పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ వితండవాదం చేస్తోందని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు ఆరోపిస్తే, తెలంగాణ మొండిగా వ్యవహరిస్తోందని ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు దుయ్యబట్టారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును మూడు నెలల్లో సిద్ధం చేయిస్తే సమస్య పరిష్కరమవుతుందని హరీశ్‌రావు సూచించగా, విభజన చట్టం ప్రకారం ఏపి, తెలంగాణలోని అన్ని నీటి పారుదల ప్రాజెక్టులను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకురాలని దేవినేని ఉమా మహేశ్వరరావు పట్టుబట్టడంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది.

చిత్రం ఢిల్లీలో గురువారం కేంద్ర జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి అమర్‌జీత్ సింగ్‌తో సమావేశమై తమ వాదనలు వినిపిస్తున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, హరీశ్‌రావు