జాతీయ వార్తలు

తొలగుతున్న అడ్డంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ట్ర అడ్డంకులు ఒక దాని తరువాత ఒకటి తొలగిపోతున్నాయి.. ముంబైలో మహారాష్ట్ర ముఖ్యమంత్రితో నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు గురువారం జరిపిన చర్చలు విజయవంతం అయ్యాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య వచ్చేనెల రెండో వారంలో హైదరాబాద్‌లో ఒప్పందం కుదరడానికి మార్గం సుగమం అయింది. మేడిగడ్డ, తమ్మిడి హట్టి, కొరటా-చనాఖా బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జూలై రెండో వారంలో తుది ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశాలున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ 101మీటర్ల ఎత్తు డిజైన్‌తో నిర్మించేందుకు తమకు అభ్యంతరం లేదని మహారాష్ట్ర తెలిపింది. అయితే 100 మీటర్ల ఎత్తువరకే ప్రస్తుతం నీటి నిల్వ చేసుకునేందుకు గేట్లు ఏర్పాటు చేసుకోవచ్చునని మహారాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు. తమ్మిడిహట్టి బ్యారేజీ 148 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో నిర్మించేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఢిల్లీలో కృష్ణాబోర్డు సమావేశం అనంతరం హరీశ్‌రావు నేరుగా ముంబై వెళ్లారు. మహారాష్ట్ర సిఎం ఫడ్నవీస్, ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి గిరీష్‌మహాజన్‌లతో ఆయన చర్చలు జరిపారు. పలు దఫాలుగా రెండు రాష్ట్రాల అధికారులు, రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రుల మధ్య సమావేశాలు జరిగాయి. ముంబైలో ఇరు రాష్ట్రాల సిఎంలు కూడా సమావేశమై ప్రాథమికంగా నిర్ణయాలు తీసుకున్నారు. తుది ఒప్పందం కోసం ముఖ్యమంత్రులిద్దరూ ఇప్పటికే సమావేశం కావలసి ఉండింది. కానీ, ప్రాజెక్టుల నిర్మాణంపై మహారాష్ట్ర పలుప్రశ్నలను లేవనెత్తింది. వీటిపై తెలంగాణ ప్రభుత్వం అందజేసిన వివరాలను మహారాష్ట్ర ఇంజనీరింగ్ అధికారులు పరిశీలన జరిపారు. వారు సంతృప్తి వ్యక్తం చేయటంతో ఇరురాష్ట్రాలు తుదిఒప్పందానికి సిద్ధమయ్యాయి.
హైదరాబాద్‌లో జూలై రెండో వారంలో జరిగే గోదావరి అంతర్ రాష్ట్ర మండలి అపెక్స్ కమిటీ సమావేశానికి రావలసిందిగా హరీశ్‌రావు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ను ఆహ్వానించారు. ఫడ్నవీస్ ఈ ఆహ్వానాన్ని మన్నించారు. ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు దాదాపు గంటసేపు చర్చించారు. మేడిగడ్డ బ్యారేజీ డిజైన్లు, ప్లాన్లు, సాంకేతిక వివరాలపై ఇరురాష్ట్రాల సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్స్ ఇంజనీర్లు ఇంతకుముందే పరిశీలించి, తుది నిర్ణయం తీసుకున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుకు మహారాష్టల్రోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకాలోని 11 గ్రామాల సరిహద్దుల్లో కేవలం 55హెక్టార్ల భూమి మాత్రమే ముంపునకు గురవుతుందని ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు నిర్ధారణకు వచ్చారు.

చిత్రం తెలంగాణ ప్రాజెక్టులపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో మంత్రి హరీశ్‌రావు భేటీ