జాతీయ వార్తలు

యువతిపై పలుమార్లు అత్యాచారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

థానే, జూన్ 25: ఒక యువతిపై ఆమె అత్త కొడుకు అనేకసార్లు అత్యాచారానికి పాల్పడిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక సమయంలో బాధితురాలిని హతమార్చడానికి కూడా నిందితుడు ప్రయత్నించగా ఆమె తప్పించుకున్నట్లు పోలీసులు చెప్పారు. 23 ఏళ్ల బాధితురాలు మహారాష్టల్రోని భివండి తాలుకాలో గల జునద్రుఖెలో తన అత్తింట్లో ఉంటోంది. అత్తమ్మ ఇద్దరు కుమారుల్లో ఒకరయిన ధ్యానేశ్వర్ పాటిల్ ఆ యువతిని 2010 మే 3న ఇంట్లో రేప్ చేశాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవదని ధ్యానేశ్వర్ తల్లిదండ్రులు బాధితురాలిని హెచ్చరించారు. ధ్యానేశ్వర్‌తో వివాహం జరిపిస్తామని హామీ ఇచ్చారు. ఆ తరువాత కూడా ధ్యానేశ్వర్ అనేకసార్లు ఆ యువతిని రేప్ చేశాడు.