జాతీయ వార్తలు

స్వామి, వాద్రా ట్విట్టర్ వార్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 25: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా, బిజెపి రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యం స్వామి మధ్య శనివారం ట్వీట్ల వార్ మొదలైంది. హోటళ్లలో పనిచేసే వెయిటర్ల గురించి తక్కువ చేసి మాట్లాడడం సంస్కారం కాదని వాద్రా ట్వీట్ చేస్తే ‘మీరు రాజకీయ ప్రకటనలు చేసే బదులు జైల్లోకి వెళ్లకుండా ఎలా ఉండాలో జాగ్రత్త పడండి’ అంటూ స్వామి ఎద్దేవా చేశారు. స్వామి హోటళ్లలో పనిచేసే వెయిటర్స్‌ను అవమానించే విధంగా మాట్లాడటం ద్వారా వృత్తిని అగౌరపరిచారని వాద్రా ధ్వజమెత్తారు. వెయిటర్లుగా పనిచేసినంత మాత్రాన వారు మనుషులు కాదా? వారు చేసే పనిని తక్కువ చేసి చూపించటం మంచిదా? అంటూ బిజెపి ఎంపీపై విరుచుకుపడ్డారు. సుబ్రమణ్యం స్వామి ఇటీవల చేసిన ఒక ట్వీట్‌లో కేంద్ర మంత్రులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రులు విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు భారత సంప్రదాయ దుస్తులు, సాధారణ దుస్తులు ధరించే విధంగా బిజెపి అధినాయకత్వం ఆదేశించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు సూటు, బూటు వేసుకుని టై కట్టుకున్న కేంద్ర మంత్రులను చూస్తే వెయిటర్ల మాదిరిగా కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. సుబ్రహ్మణ్యస్వామి చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి. దీనిపైనే శనివారం సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా తన ట్విట్టర్ స్పందించారు. వెయిటర్లను అవమానిస్తారా? అంటూ విరుచుకుపడ్డారు. వృత్తిని గౌరవించటం నేర్చుకోవాలని స్వామికి హితవు చెప్పారు. వాద్రా ట్వీట్‌కు సుబ్రమణ్యం స్వామి అదే స్థాయిలో బదులిచ్చారు. ‘మీరు రాజకీయ ప్రకటనలు చేసే బదులు జైలు వెళ్లకుండా ఎలాగో చూసుకోవాలి’ అని వ్యాఖ్యానించారు.