జాతీయ వార్తలు

తమిళ కాంగ్రెస్ చీఫ్ ఎలంగోవన్ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జూన్ 25: తమిళనాడు కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తున్నానంటూ తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇవికె ఎలంగోవన్ రాజీనామా చేశారు. పార్టీ రాష్ట్ర కమిటీకి ఈ నెల 15నే రాజీనామా చేశారని కాంగ్రెస్ నేత, ఇవికె ముఖ్యఅనుచరుడు శివరామన్ శనివారం ఇక్కడ వెల్లడించారు. గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సంతృప్తికరమైన ఫలితాలు సాధించలేకపోయిందని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారన్నారు. ఢిల్లీ హైకమాండ్‌కు రాజీనామా పత్రం పంపామని, అయితే ఆమోదం లభించలేదని ఆయన చెప్పారు. రాజీనామా ఎందుకు ఆమోదించలేదో కారణాలు తెలియదని ఆయన పేర్కొన్నారు. ఎలంగోవన్ పనితీరు మొదటినుంచీ వివాదాలకు దారితీసింది.