జాతీయ వార్తలు

బిహార్ టాపర్ అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, జూన్ 25: బిహార్ ఇంటర్‌మీడియట్ పరీక్షలో రాష్ట్ర టాపర్ రూబీరాయ్‌ని శనివారం అరెస్ట్ చేశారు. మోసం చేసి, మాస్ కాపీయింగ్‌తో టాపర్‌గా మారిన ఈ అమ్మాయిని ప్రత్యేక విచారణ బృందం అరెస్టు చేసింది. టాపర్‌గా నిలిచిన ఈ విద్యార్థిని పొలిటికల్ సైన్స్‌ని ‘ప్రోడికల్ సైన్స్’ అని సంబోధించటమే కాకుండా, అది వంటల శాస్తమ్రని చెప్పటం విస్తుపోయేలా చేసింది. బిహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు (బిఎస్‌ఈబి) పరీక్షల రాకెట్‌కు సంబంధించి నలుగురిపై పాట్నా కోర్టు నాన్‌బెయిలబుల్ వారంట్లు జారీ చేసింది. ఆ వెంటనే పోలీసులు రూబీని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు టాపర్లు సౌరభ్ శ్రేష్ట, రాహుల్ కుమార్, విష్ణురాయ్ కాలేజి ప్రిన్సిపల్ బచ్చారాయ్‌లపై వారంట్లు జారీ అయ్యాయి. హ్యుమానిటీస్ కేటగిరీలో టాపర్‌గా నిలిచిన రూబీని ఓ టీవీ చానల్ వాళ్లు ఇంటర్వ్యూ చేసిన సందర్భంలో ఆమె చెప్పిన సమాధానాలు మొత్తం స్కాం డొంకను కదిలించాయి. పొలిటికల్ సైన్స్‌ను ప్రోడికల్ సైన్స్‌గా పేర్కొనడమే కాకుండా వంటల గురించి చెప్పే శాస్తమ్రని పేర్కొనటంతో రాష్ట్రంలో జరుగుతున్న తతంగం వెలుగులోకి వచ్చింది. వైశాలిలోని విష్ణురాయ్ కాలేజీ నుంచి పరీక్ష రాసిన రూబీకి బిఎస్‌ఈబి ఆఫీసులో తాజాగా మళ్లీ పరీక్షను నిర్వహించారు. ఆమెను ప్రశ్నించిన సందర్భంలో టాపర్లుగా ప్రకటించటానికి ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ.15లక్షలు వసూలు చేసినట్లు పేర్కొన్నట్లు ఎస్‌ఎస్‌పి మహరాజ్ వెల్లడించారు. ఫెయిలయిన విద్యార్థులకు పాసయినట్లుగా సర్ట్ఫికెట్లు ఇచ్చేందుకు రూ.10లక్షలు వసూలుచేశారన్నారు.

చిత్రం బిహార్‌లో మోసపూరితంగా టాపర్‌గా నిలిచిన రూబీరాయ్‌ని అరెస్టు చేస్తున్న పోలీసులు