అంతర్జాతీయం

మళ్లీ బీజేపీదే అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఏప్రిల్ 9: భారత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రెండోసారి కూడా విజయం సాధిస్తుందని, అవినీతి ఆనవాళ్లను పూర్తిగా తుడుచిపెట్టేస్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. కొలంబియా బిజినెస్ స్కూల్లో జరిగిన భారత వార్షిక వ్యాపార సదస్సులో మాట్లాడిన సుబ్రహ్మణ్యం స్వామి బీజేపీ రెండోసారి అధికారంలోకి వస్తే బలమైన, సుస్థిరమైన, అన్ని కోణాల్లోనూ ఐక్యతను సంపాదించుకున్న భారతావనిని నిర్మిస్తుందని ఉద్ఘాటించారు. 2019లో జరిగే ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీ సాధించే అవకాశాలు బీజేపీకి పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. 2014 ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయానికి మూడు సానుకూల అంశాలు బలమైన కారణం అయ్యాయన్నారు. వాటిలో ఒకటి సుపరిపాలనలో నరేంద్ర మోదీకి ఉన్న ప్రతిష్ఠ కాగా, రెండోది అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలన్న పటిమేనని, మూడోది బీజేపీని అధికారంలోకి తెస్తే హిందువుల ప్రయోజనాలకు మరింత బలం చేకూరుతుందని ప్రజలు భావించడమేనని తెలిపారు. కులపరమైన విధేయతలకు అతీతంగా వ్యవహరించి తమ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను ఒప్పించడంలో మోదీ సఫలమయ్యారని తెలిపారు. ఇప్పటికే 2019 ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వ్యూహ రచనలు బీజేపీలో మొదలయ్యాయని పేర్కొన్న స్వామి రెండోసారి అధికారంలోకి వస్తే అవినీతికి లేశమాత్రమేమైనా అవకాశం లేని గుణాత్మక పరిస్థితులను పాదుకొల్పుతామన్నారు. తమ పార్టీ మైనారిటీలకు వ్యతిరేకం కాదని అన్నారు. 2014లో అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీల అమలులో ఇంకా ఎంతో కృషి చేయాల్సి వుందని పేర్కొన్న ఆయన బీజేపీ ఆర్థిక పనితీరు గవర్నెన్స్ పరంగా ఇంకా మెరుగుకావాల్సి ఉందన్నారు. అయితే పెద్దనోట్ల రద్దు, వస్తు సేవల పన్ను అమలువల్ల పరిస్థితులు కొంతమేర సంక్లిష్టంగా మారిన నేపథ్యంలో వాటిని అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు. పెద్దనోట్ల రద్దును ఓ విఫల చర్యగా పేర్కొన్న స్వామి ప్రజలు మాత్రం దీనివల్ల కలిగిన కష్టాన్ని పెద్దగా పట్టించుకోలేదని, అందుకు కారణం నల్లధనాన్ని పోగేసిన వారి గుట్టు రట్టు చేయడమే ఈ చర్య వెనకున్న అసలు ఉద్దేశ్యమని ప్రజలు గ్రహించడమేనని అన్నారు. ఇక జీఎస్టీ విషయంలో పూర్తిగా కొత్త వాతావరణం ఏర్పడిందని, ఇప్పటికీ అదొక గుదిబండగానే మారిందన్నారు.