జాతీయ వార్తలు

అడవుల అభివృద్ధికి గ్రీన్ సెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: దేశంలో పర్యావరణాభివృద్ధికి, అడవుల విస్తరణకు కేంద్రం గ్రీన్ సెస్‌ను విధించాలనే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. కేంద్ర పర్యావరణ శాఖకు భోపాల్‌లోని అడవుల పరిశోధన సంస్ధ అడవుల అభివృద్ధిపై జాతీయ విధాన పత్రాన్ని రూపొందించి సమర్పించింది. ఈ పత్రాన్ని అన్ని రాష్ట్రాలకు అభిప్రాయ సేకరణ నిమిత్తం కేంద్రం పంపించింది. వచ్చే దశాబ్దంలోగా అడవుల వెలుపల రెండింతలు పచ్చదనాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు సమష్టిగా ప్రణాళిక ఖరారు చేయాలని పేర్కొన్నారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, భోపాల్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్స్ ఉమ్మడిగా ఈ విధానపత్రాన్ని రూపొందించాయి. జాయింట్ ఫారెస్టు మేనేజిమెంట్ నుంచి కమ్యూనిటీ ఫారెస్టు మేనేజిమెంట్ వ్యవస్ధకు మారాలని సిఫార్సు చేశారు. నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి ఆరు నెలల్లోగా జాతీయ అటవీ విధానాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. కొన్ని ఉత్పత్తులపై పర్యావరణ సెస్, గ్రీన్ ట్యాక్స్, కార్బన్ ట్యాక్స్‌ను విధించాలని సిఫార్సు చేశారు.
పాలసీ ఖరారు కాలేదు
న్యూఢిల్లీ: అటవీ విధాన ముసాయిదా బిల్లును ఇంకా ఖరారు చేయలేదని కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ తెలిపింది. భోపాల్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ రూపొందించిన నివేదిక కాపీ పొరపాటున సంస్థ వెబ్‌సైట్లో అప్‌లోడ్ అయంని. అజాగ్రత్త వల్లే నివేదికనే ముసాయిదా బిల్లుగా పేర్కొన్నట్టు డైరెక్టర్ జనరల్ శరద్ నేగి తెలిపారు.