జాతీయ వార్తలు

డిగ్రీ ఆన్‌లైన్ అడ్మిషన్లకు మరోసారి వెబ్ ఆప్షన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ ఆన్‌లైన్ అడ్మిషన్లకు మరోమారు వెబ్ ఆప్షన్ల అవకాశం కల్పించారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీలో పాసైన అభ్యర్ధులు, గతంలో ఆన్‌లైన్ రిజిస్టర్ చేసుకోని వారు ఈ నెల 26 నుండి తమ వెబ్ ఆప్షన్లను ఇవ్వాలని కాలేజీయేట్ ఎడ్యుకేషన్ అధికారులు సూచించారు. 26 నుండి 28 వరకూ వారు తమ ఆప్షన్లు ఇవ్వవచ్చని, తొలి దశ వెబ్ ఆప్షన్లు ఇచ్చిన అభ్యర్థులు మాత్రం ఈ నెల 29 నుండి జూలై 1వ తేదీ వరకూ కొత్త ఆప్షన్లు ఇవ్వవచ్చని అధికారులు పేర్కొన్నారు. స్పెషల్ క్యాటగిరీ అభ్యర్థులు ,ఇతర బోర్డుల్లో చదివిన వారు కూడా ఈ నెల 29 నుండి తమ ఆప్షన్లు ఇవ్వాలని అధికారులు పేర్కొన్నారు. వీరందరికీ రెండో దశ సీట్ల కేటాయింపు జూలై 4న ఇస్తామని చెప్పారు. శనివారం జరిగిన సమీక్షా సమావేశానికి సాంకేతిక సిబ్బంది, ఆరు విశ్వవిద్యాలయాల అధికారులు హాజరయ్యారు.
1.63కోట్ల పాఠ్యపుస్తకాల పంపిణీ
రాష్ట్రంలో 10 జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే 1,62,51,327 పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసినట్టు పాఠశాల విద్యాశాఖాధికారులు తెలిపారు. 1,72,91,940 పాఠ్యపుస్తకాల అవసరం ఉందని ఆ ప్రకారం 1,72,99,013 పుస్తకాలను జిల్లాలకు పంపించామని అధికారులు చెప్పారు. సగటున 93.98 శాతం పంపిణీ పూర్తయిందని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 85.95 , రంగారెడ్డిలో 98.86, హైదరాబాద్‌లో 93.91, మెదక్‌లో 87.89, నిజామాబాద్‌లో 97.92, ఆదిలాబాద్‌లో 96.40, కరీంనగర్‌లో 98.63, వరంగల్‌లో 99.95, ఖమ్మంలో 99.25, నల్గొండలో 89.69 శాతం పుస్తకాల పంపిణీ పూర్తయిందని అన్నారు.
ఎంజి యూనివర్శిటీకి సెర్చి కమిటీ
మహాత్మాగాంధీ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ఎంపికకు ప్రభుత్వం సెర్చికమిటీని నియమించింది. ఈ మేరకు జీవో 180 జారీ చేశారు. సెర్చికమిటీలో ఇసి ప్రతినిధిగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ మాజీ విసి విఎస్ ప్రసాద్, యుజిసి నామినీగా కలకత్తా యూనివర్శిటీ విసి సురంజన్ దాస్, ప్రభుత్వ ప్రతినిధిగా రాజీవ్ ఆర్ ఆచార్య నియమితులయ్యారు.