జాతీయ వార్తలు

రాజ్యాంగ పరిరక్షణకు ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 23 నుంచి దేశవ్యాప్తంగా ‘రాజ్యాంగ పరిరక్షణ’ ఉద్యమాన్ని ప్రారంభించనున్నారు. రాజ్యాం గం, దళిత సమాజంపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఈ ఉద్యమాన్ని చేపట్టడం ద్వారా దళితులు, అణగారిన వర్గాల చేరువకు పార్టీని తీసుకెళ్లడమే రాహు ల్ ప్రధాన లక్ష్యం. దళిత వర్గాలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, జిల్లా పరిషత్‌లు, పౌర సంస్థలు, పంచాయతీ సమితులకు నేతృత్వం వహించిన నాయకులు కూడా ఈ ఉద్యమ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ వర్గాలపై ప్రస్తుతం జరుగుతున్న దాడుల అంశంపై ఆయా వర్గాల్లో మరింత చైతన్యం తీసుకొని రావడానికి కాంగ్రెస్ యత్నిస్తోంది. కాగా కాంగ్రెస్ పార్టీ నేతలు, యువకులు, మహిళలు, సేవాదళ్ విభాగాలు టొల్కతోరా స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి హాజరవుతారు.
‘్భజపా పాలనలో రాజ్యాంగం తీవ్ర దాడులకు గురవుతోంది. దళితులను విద్య, ఉపాధి అవకాశాలకు దూరం చేస్తున్నారు. వివిధ అంశాలపై వీరిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ అంశాలను ప్రారంభ సమావేశం ప్రముఖంగా ప్రస్తావిస్తుంది’ అని కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్డు కులాల విభాగం చైర్‌పర్సన్ నితిన్ రావత్ వివరించారు. ‘కేవలం బీఆర్ అంబేద్కర్ వల్లనే తానీ స్థాయికి ఎదిగానని మోదీ చెబుతున్నారు. అటువంటప్పుడు ఆయన పాలనలో రాజ్యాంగం, దళితులపై దాడులు ఎందుకు జరుగుతున్నట్టు’ అని రావత్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా అటువంటి పరిస్థితి ఎన్నడూ ఏర్పడలేదన్నారు.

చిత్రం..రాహుల్ గాంధీ