జాతీయ వార్తలు

మరణ శిక్షే సరైనది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: ఎనిమిదేళ్ల బాలికపై అతి దుర్మార్గంగా అత్యాచారానికి పాల్పడిన నిందితులకు ఉరి శిక్షే సరైనదని, ఈ మేరకు చట్టాన్ని చేసేందుకు తక్షణమే అసెంబ్లీని సమావేశపర్చాలని ప్రతిపక్ష నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. కతువాలో జరిగిన ఈ దుర్ఘటన యావద్దేశాన్ని కుదిపేసిందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు ఆస్కారం లేకుండా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి చట్టం తీసుకురావాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడిన ఫరూక్ అబ్దుల్లా ఇలాంటి ఘటనల్లో శిక్షలు ఎంత కఠినంగా ఉంటే అంతగా తగ్గుముఖం పడతాయన్నారు. ‘కతువా బాధిత బాలిక నా కుమార్తె లాంటిది. అత్యాచార ఘటనపై దేశం మేల్కొంది. నిరసనలు హోరెత్తా యి. నిందితులకు ఉరిశిక్ష అమలు చేసి తీరాలి. అప్పుడే దేశం నివ్వెరపోయే ఇలాంటి ఘటనలు తగ్గుముఖం పడతాయి. ఈ మేరకు చట్టం చేయడానికి తక్షణం అసెంబ్లీని సమావేశపర్చాలి’ అని ఫరూక్ డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్న పీడీపీ-బీజేపీ ప్రభుత్వం ఏ మాత్రం ఆలస్యం లేకుండా ప్రత్యేకంగా అసెంబ్లీని స మావేశపరచాలన్నారు. అయితే, మైనర్ బాలికలపై అ త్యాచారానికి పాల్పడేవారికి మరణశిక్ష విధించేలా తమ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొస్తుందని ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూడా ఇప్పటికే ప్రకటించారు. ‘్భ విష్యత్తులో ఏ బాలిక కామాంధుల చేతుల్లో బలికాకూడదనేదే మా ప్రభుత్వ లక్ష్యం. ఈ మేరకు ప్రత్యేక చ ట్టా న్ని తీసుకువస్తాం’ అని ఈ నెల 12న స్పష్టం చేశారు.
కొవ్వొత్తుల ర్యాలీలు
దేశవ్యాప్తంగా మహిళలకు, బాలికలకు రక్షణ కల్పించాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేసింది. కతు వా అత్యాచార ఘటనను నిరసిస్తూ సత్వారా చౌక్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పీసీసీ అధ్యక్షుడు జీఏ మీర్ నాయకత్వంలో కొవ్వొత్తులతో గంటకు పైగా నిరసన తెలిపింది. మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని, తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని మీర్ డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు శ్యామ్‌లాల్ శర్మ మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం అవసరమైతే తాము ప్రాణత్యాగానికైనా సిద్ధమేనన్నారు. దేశవ్యాప్తంగా పౌరులకు రక్షణ కరువైందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ బాధ్యతను విస్మరించడం వల్లే ఇలాంటి హేయమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయని శ్యా మ్‌లాల్ విమర్శించారు.
సుప్రీం జోక్యాన్ని స్వాగతిస్తున్నాం
12రోజులుగా జరుగుతున్న నిందితుల అనుకూల, వ్యతిరేక నిరసనలు, కతువా అత్యాచార కేసును సీబీఐకి అప్పగించాలన్న డిమాండ్ల నేపథ్యంలో సుప్రీంకోర్టు జోక్యాన్ని జమ్మూ హైకోర్టు బార్ అసోసియేషన్ స్వాగతించింది. అంతేకాకుండా రాష్ట్రంలో అక్రమంగా తిష్టవేసిన రోహింగ్యాలను ఇక్కడినుంచి తరలించాలని డి మాండ్ చేసింది. ‘ఈ కేసులో సుప్రీంకోర్టు జోక్యాన్ని స్వాగతిస్తున్నాం. కతువా కేసును సీబీఐకి అప్పగించా లా లేదా అనే విషయాన్ని సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది’ అని సీనియర్ అడ్వకేట్, బార్ అసోసియేషన్ సభ్యుడు సురీందర్ కౌర్ విలేఖరులకు తెలిపారు. నిరసనలతో రాష్ట్రం అట్టుడికిపోతోందని సుప్రీంకోర్టు జోక్యంతోనై నా బాధిత బాలికకు న్యాయం జరిగి శాంతియుత పరిస్థితులు నెలకొంటాయని ఆశిస్తున్నామని బార్ అసోసియేషన్ మహిళా ప్రతినిధి గగన్ బసోత్రా వ్యాఖ్యానించారు. కాగా, అత్యాచార బాధిత బాలికకు నివాళిగా జమ్మూ హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు కూడా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
ఇలావుండగా కతువా అత్యాచార ఘటనలో నిందితులైన ఎనిమిదిమంది తరపున ఉచితంగా వాదిస్తామన్న కతువా బార్ అసోసియేషన్ (బాక్) తన ప్రతిపాదనను విరమించుకుంటున్నట్లు ప్రకటించింది. న్యాయ ప్రక్రియను అడ్డుకోవద్దని న్యాయవాదులను సుప్రీంకోర్టు హెచ్చరించిన నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు బాక్ అధ్యక్షుడు కీర్తి భూషణ్ మహాజన్ వెల్లడించారు.
చిత్రం..కతువా, ఉన్నావ్ అత్యాచారాలకు నిరసనగా ఆదివారం అహ్మదాబాద్‌లో నిర్వహించిన భారీ ర్యాలీ