జాతీయ వార్తలు

కశ్మీరీల జీవనం.. సవాళ్లమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్ము, ఏప్రిల్ 19: గతంలోవివిధ కారణాలవల్ల ఎదురైన సవాళ్లను ఎదుర్కోవడంలో జమ్ము-కశ్మీర్ ప్రజలు ఎంతో ధైర్యాన్ని, సాహసాన్ని ప్రదర్శించడమే కాదు, వేగంగా వాటినుంచి బయటపడ్డారంటూ రాష్టప్రతి రామ్‌నాథ్‌కోవింద్ ప్రశంసించారు. బుధవారం రాత్రి జమ్ములోని అమర్ మహల్ ప్యాలెస్‌లో తన గౌరవార్థం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, జమ్ము-కశ్మీర్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నదన్నారు. కానీ భారత్, తనలోని భాగమైన జమ్ము-కశ్మీర్ అంటే ఎంతో గర్వపడుతుందన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజల్లోని ఆర్థిక, విద్యావకాశాలను వినియోగించుకునే సామర్థ్యం పట్ల దేశానికి అచంచల విశ్వాసమున్నదన్నారు. రాష్ట్ర అభివృద్ధికి నిబద్ధతతో కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలను ఆయన ప్రశంసించారు. భారత సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు జమ్ము-కశ్మీర్ కేంద్రమన్నారు. గౌతమ బుద్ధుడు, సుఫీయిజం, శైవం, శక్తి ఆరాధన ఇక్కడి వారసత్వ సంస్కృతి అన్నారు. ఇక అభివృద్ధి విషయానికి వస్తే జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై నిర్మించిన అతిపొడవైన టనె్నల్‌ను ప్రస్తావించారు. ఇంకా కాట్రా వద్ద నిర్మించిన మాతా వైష్ణోదేవీ రైల్వేస్టేషన్, ఐఐటీలు, ఐఐఎంల, ఏఐఐఎంఎస్‌లు ఇక్కడి అభివృద్ధిని ప్రతిబింబిస్తున్నాయన్నారు. రాష్టప్రతి కోసం గవర్నర్ ఎన్.ఎన్. వోహ్రా రాజ్‌భవన్‌లో విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ముఫ్తీ, ఉపముఖ్యమంత్రి నిర్మల్ సింగ్‌లు హాజరయ్యారు.