జాతీయ వార్తలు

తొగాడియా దీక్ష విరమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహమ్మదాబాద్, ఏప్రిల్ 19: విశ్వహిందూ పరిషత్ మాజీ నేత ప్రవీణ్ తొగాడియా తన నిరవధిక నిరాహారదీక్షను గురువారం విరమించారు. ఆయోధ్యలో రామ మందిరం ని ర్మాణం సహా వివిధ డిమాండ్లతో మూడు రో జుల క్రితం అహమ్మదాబాద్‌లో ఆయన నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు. కాగా ‘హిందూ త్వ రాజకీయాలను’ పునరుద్ధరించాలన్న డి మాండ్‌తో దేశవ్యాప్త పర్యటన చేపడతానని ప్రకటించారు. కేవలం డాక్టర్ల సలహా మేరకే తాను నిరాహార దీక్షను విరమిస్తున్నానని తొగాడియా (62) అన్నారు. ప్రైర్‌బ్రాండ్ నేతగా మారిన సర్జన్ తొగాడియాను అఖిలేశ్వర్ దాస్ మహరాజ్ వంటి కొందరు దీక్ష విరమించమని కోరారు. దీంతో ఆయన కొందరు మతపెద్దలు అందించిన పండ్ల రసాన్ని స్వీకరించి దీక్షను విరమించారు. గతవారం విశ్వహిందూ పరిషత్ అధ్యక్ష పదవికి తన నామి నీ రాఘవరెడ్డి, మాజీ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ వి.ఎస్. కోగ్జీ చేతిలో పరాజయం పొందడంతో తొగాడియా వీహెచ్‌పీని వీడారు. అ యోధ్యలో రామాలయం నిర్మించాలని, చట్టవిరుద్ధంగా దేశంలో ఉన్న బంగ్లాదేశీయులను తిప్పి పంపాలని, కశ్మీర్‌కు చెందిన హిందువు ల పునరావాసం కల్పించాలని, 370వ అధికరణాన్ని రద్దు చేయాలన్న డిమాండ్లతో ఆయన మంగళవారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా విలేకర్లతో మా ట్లాడుతూ, బీజేపీ,ప్రధాని నరేంద్ర మోదీ పనితీరు గత ప్రభుత్వాలకంటే దారుణంగా ఉన్నదన్నారు. ప్రస్తుత భాజపా నాయకత్వం తామిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. ఈ నేపథ్యంలో ‘హిందూత్వ రాజకీయాల’ పునరుద్ధరించాలని కోరుతూ దేశంలోని వంద కోట్ల మంది హిందువుల వద్దకు వెళ్తానన్నారు. ప్రజాకాంక్షలకు అనుగుణంగా 2019లో హిందూత్వ రాజకీయాలను తాను వ్యవస్థాపిస్తానన్నారు. రేపట్నుంచీ తాను చే పట్టే పాన్ ఇండియా పర్యటనలో హిందువుల వాణి వినిపిస్తానన్నారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ, వీహెచ్‌పీ కార్యకర్తలు ఇంకా తనవేంటే ఉన్నారన్నారు.