జాతీయ వార్తలు

48మంది నేతలపై అత్యాచార కేసులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: ఇటీవలి కాలంలో చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడిన సంఘటనలు వెలుగులోకి రావ డం, దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగసిపడుతున్న విష యం తెలిసిందే. మహిళలపై లైంగిక వేధింపులు నిరోధించేందుకు కృషిచేయాల్సిన ప్రజాప్రతినిధులే ఇలాంటి కేసుల్లో ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. దేశవ్యాప్తంగా 48 మంది ప్రజాప్రతినిధులపై అత్యాచార కేసులు నమోదై ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. వీరిలో 45మంది ఎమ్మెల్యేలు కాగా ముగ్గురు ఎంపీలున్నారు. ఇలావుండగా గత ఐదేళ్లలో ఇలాం టి కేసులు నమోదై ఉన్న 327 మందికి రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్లు సైతం ఇచ్చాయి. ఇలాంటి వారిలో 40 మందికి ఎంపీలుగా పోటీ చేసేందుకు టిక్కెట్లిచ్చాయి. ఇక ఇండిపెండెంట్ల విషయానికి వస్తే.. మహిళలపై దాడులకు పాల్పడిన కేసులున్న 18 మంది గత ఐదేళ్లలో పార్లమెంటుకు పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో 100 మంది ఇండిపెండెంట్లపై మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన కేసులున్నాయి.
మహారాష్టల్రో ఇలాంటి కేసులున్న 12 మంది ప్రజాప్రతినిధులున్నారు. పశ్చిమ బెంగాల్‌లో 11 మంది, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్‌లలో ఐదుగురు ప్రతిప్రతినిధులపై ఇలాంటి కేసులున్నాయి. మహిళలపై దాడులకు పాల్పడిన కేసులున్న 65 మంది మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయగా, బిహార్ నుంచి 62 మంది, పశ్చిమ బెంగాల్ నుంచి 52 మంది ఉన్నారు. ఇక పార్టీల పరంగా చూస్తే ఇలాంటి కేసులున్న 47 మందికి బీజేపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్లు ఇవ్వగా, బీఎస్పీ 35 మందికి టిక్కెట్లిచ్చింది. ఎస్పీ టిక్కెట్లు దక్కించుకున్నవారు 24 మంది ఉన్నారు.