జాతీయ వార్తలు

మహిళలను గౌరవిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురుక్షేత్ర, ఏప్రిల్ 19: దేశంలో విదేశీయుల పాలన వల్ల భారత సంస్కృతి, సంప్రదాయాలు మంటగలిచిపోయాయని ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. మహిళలకు సరైన గౌరవం దక్కకుండాపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కురుక్షేత్ర విశ్వవిద్యాలయం 30వ స్నాతకోత్సవంలో ఉప రాష్టప్రతి మాట్లాడుతూ ‘దేశ జనాభాలో 50 శాతం ఉన్న మహిళను గౌరవించాలి’ అని పిలుపునిచ్చారు. భారత మాత అన్న పేరుకు సార్ధం చేకూరేలా మహిళలను గౌరవించాలని ఆయన ఉద్ఘాటించారు. ‘దేశం లో నదులకు ఎక్కువగా స్ర్తిల పేర్లే ఉన్నాయి. గోదావరి, గంగా, యమున తదితర పేర్లలో జీవనదులు పారుతున్నాయి’ అని వెంకయ్య చెప్పారు. అలాగే సరస్వతి మాత అంటే విజ్ఞానం, దుర్గా మాత అంటే రక్షణ, లక్ష్మీమాత అంటే ఆర్థికం అంటూ మహిళల గొప్పతనాన్ని ఆయన ప్రస్తావించారు. ‘్భరత సంప్రదాయాన్ని అందరూ పాటించాలి. మహిళలను గౌరవించాలి’ అని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో సంస్కృతి, సంప్రదాయాలు మంటగలిసి పోవడానికి విదేశీ వలస పాలనే కారణమని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మహిళలపై ఇప్పుడు జరుగుతున్న ఆకృత్యాలకు కారణం కూడా అదేనని ఆయన అన్నారు. అయితే దేశాన్ని కుదిపేస్తున్న కథువా, ఉన్నావ్ గ్యాంగ్‌రేప్ సంఘటనలు ఉప రాష్టప్రతి ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. ఎలాంటి సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న ఆయన ముఖ్యంగా విద్యార్థులు హింసకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. నిరసనలు శాంతియుతంగా తెలపాలే తప్ప ఆస్తులకు నష్టం చేయకూడదని వెంకయ్య స్పష్టం చేశారు. యూనివర్శిటీ గ్రాడ్యుయేట్లు తమ శక్తి సామర్ధ్యాలతో పైకి రావాలే తప్ప పక్కదారుల్లో కాదని ఆయన తెలిపారు. అంకితభావం, క్రమశిక్షణతో లక్ష్యాలను చేరుకుని ‘కొత్త భారత్’ను నిర్మించాలని ఉప రాష్టప్రతి పిలుపునిచ్చారు. మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం, ప్రధాని నరేంద్ర మోదీ జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన అన్నారు. భారత్ అవకాశాలకు పెట్టని కోట అంటూ, విద్యార్థులు వాటిని అందిపుచ్చుకోవాలని ఉద్ఘాటించారు. చదువులు పూర్తిచేసుకుని యూనివర్శిటీ వదిలి వెళ్తున్న విద్యార్థులు మరింత క్ర మ శిక్షణ, గౌరవంతో మెలగాలని ఆయన తెలిపారు. ‘్భష మన సంస్కృతిని ప్రభావితం చేస్తుంది. అందరూ మాతృభాషను గౌరవించాలి. దానికి ప్రాధాన్యత ఇవ్వాలి’ అని వెంకయ్య స్పష్టం చేశారు. దేశం జనాభాలో 65 మంది 30 ఏళ్ల లోపువారే. జాతి నిర్మాణానికి వారి సేవలు సద్వినియోగం కావాలి. ఇది జరిగిననాడు సమాజంలో పెను మార్పులు వస్తాయి’ అని ఉప రాష్టప్రతి వివరించారు. కురుక్షేత్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆయన వెల్లడించారు. వైస్ ఛాన్సలర్, అధ్యాపకులు, విద్యార్థులు మున్ముందు ఇదే అంకితభావాన్ని ప్రదర్శిస్తూ వర్శిటీ ప్రతిష్టను మరింత ఇనుమడింప చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పీహెచ్‌డీ, ఎంఫిల్ పూర్తిచేసిన విద్యార్థులకు వర్శిటీ చాన్సలర్, హర్యానా గవర్నర్ కప్టన్‌సింగ్ సో లంకి పట్టాలు ప్రదానం చేశారు.

చిత్రం..కురుక్షేత్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు తదితరులు