జాతీయ వార్తలు

విచారణ అవసరం లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి బీహెచ్ లోయ అనుమానాస్పద మరణం కేసులో స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేయటం పట్ల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌సింగ్ సుర్జేవాలా తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. సుర్జేవాలా గురువారం ఏఐసీసీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ న్యాయమూర్తి లోయ మరణం చాలామందికి సం బంధించిన అంశమని చెబుతూ న్యాయమూర్తి అనుమానాస్పద పరిస్థితిలో మరణిస్తే దర్యాప్తు జరపవలసిన అవసరం లేదా అని సుర్జేవాలా ప్ర శ్నించారు. దేశ చరిత్రలో ఈరోజు చా లా విచారకర దినమని చెప్పారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నిందితుడుగా ఉన్న తుల్సిరాం ప్రజాపతి, సొహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసుపై విచారణ జరుపుతున్న న్యాయమూర్తి అకస్మాత్తుగా మరణిస్తే సు ప్రీం కోర్టు ప్రత్యేక విచారణ అవసరం లేదని భా వించడం అన్యాయమని, తీర్పు చాలా ప్రశ్నల కు సమాధానా లు ఇవ్వలేకపోయిందన్నారు. నిందితులకు అనుకూలంగా తీర్పు ఇస్తే న్యాయమూర్తి లోయకు రూ.100 కోట్లు ముడుపులు చెల్లించేందుకు ప్రయత్నాలు జరిగినట్లు లోయ సోదరి 2017 నవంబర్‌లో పత్రికలకు లేఖ రాసిందని సుర్జేవాలా గుర్తు చేశారు. గుండెనొప్పి రాకున్నా వచ్చినట్లు చెబితే అనుమానించవలసిన అవసరం లేదా? అని ఆయ న అడిగారు. న్యాయమూర్తి లోయ ముంబా యి నుండి నాగపూర్‌కు రైలులో వెళ్లినట్లు ఎక్కడా రికా ర్డు లేదని సుర్జేవాలా చెప్పారు. దర్యాప్తు జరపకుండానే పిటిషన్లలో ఎలాంటి నిజం లేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. న్యాయమూర్తి లోయ నాగపూర్‌లోని రవి భవన్‌లో ఉన్నట్లు భవన్ సిబ్బం ది చెప్పలేదన్నారు. లోయ బట్టలపై రక్తపు మరకలు కనిపించినట్లు ఆయన కుటుంబ సభ్యులు చెప్పలేదా అని సుర్జేవాలా అడిగారు. రవి భవన్‌లో ము గ్గురు న్యాయమూర్తులు రెండు మంచాలపై ఎలా పడుకుంటారని ప్రశ్నించారు. కుటుంబ సభ్యుల అనుమతి తీసుకోకుండానే పోస్టుమార్టం ఎలా నిర్వహిస్తారని ఆయన నిలదీశారు. సుప్రీం కోర్టుకు చెందిన నలుగురు న్యాయమూర్తులు కూడా న్యాయమూర్తి లోయ మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారని ఆయన గుర్తుచేశారు.

చిత్రాలు..సుప్రీం కోర్టు వెలుపల విలేఖరులతో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేత, పిటిషనర్లలో ఒకరైన తెహసీన్ పూనావాలా
*ఏఐసీసీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుర్జేవాలా