జాతీయ వార్తలు

అనంత్‌నాగ్ నుంచి మెహబూబా విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జూన్ 25: జమ్మూ, కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అనంత్‌నాగ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో 12 వేలకుపైగా భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ నెల 22న ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగ్గా, శనివారం ఫలితాలను ప్రకటించారు. తన తండ్రి దివంగత ముఫ్తీ మహమ్మద్ ప్రాతినిధ్యం వహించిన అనంత్‌నాగ్ నియోజకవర్గంనుంచి జరిగిన ఉప ఎన్నికలో మెహబూబా తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి హిలాల్ అహ్మద్ షాపై 12వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. మెహబూబాకు 17,698 ఓట్లు రాగా షాకు 5,615 ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో నిలిచిన నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థికి 2,811 ఓట్లు వచ్చాయి. జనవరి 7న ముఫ్తీ మహమ్మద్ మృతి చెందడంతో ఉప ఎన్నిక జరపాల్సి వచ్చింది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 38 శాతం పోలింగ్ జరగ్గా ముఫ్తీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన షాపై 6వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అప్పటికే లోక్‌సభ సభ్యురాలుగా ఉన్నందున మెహబూబా ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు.