జాతీయ వార్తలు

మంచి నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే కామాంధులకు మరణశిక్ష విధించేలా కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని కథువా బాధితురాలి తండ్రి హర్షించారు. జమ్మూకాశ్మీర్‌లోని కథువాలో ఎనిమిదేళ్ల చిన్నారిపై గ్యాంగ్‌రేప్, హత్య ఘటనలు యావత్ భారత్‌ను కుదిపేసిన సంగతి తెలిసిందే. మైనర్లపై వరుసగా జరుగుతున్న లైంగిక ఆకృత్యాలపై కదిలిన కేంద్రం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్స్ (పీఓఎస్‌సీఓ) చట్టాన్ని సవరించాలని నిర్ణయించింది. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిపై కథువా బాధితురాలి తండ్రి మాట్లాడుతూ ‘మేం సామాన్యులం. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై లోతుపాతులు మాకు తెలియ దు. మైనర్లపై జరుగుతున్న ఘాతుకాలపై ఓ నిర్ణయం తీసుకుంది. దానివల్ల మంచి జరుగుందన్నది మా విశ్వాసం. కొత్త చట్టం మాలాంటి వారికి న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నాడు. పోక్సో చట్ట సవరణను తాము హర్షిస్తున్నామని బాధితురాలి తండ్రి అన్నాడు. ‘బాధితులు ఎవరైనా బాధితులే. అందులో హిందూ, ముస్లిం అన్న భేదం లేదు. కన్నబిడ్డ ఎవరికైనా కన్నబిడ్డే’అని అతడు పేర్కొన్నాడు. పనె్నండేళ్లలోపు చిన్నారులపై అత్యాచారాలకు పాల్ప డే కామాంధులకు మరణశిక్ష విధించేలా ఆర్డినెన్స్ తేవడం, దానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం జరిగిన కేంద్ర కేబినెట్ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపింది. రేపిస్టులకు మరణశిక్షే సరైందని, ఆ దిశగా ప్రయత్నా లు సాగుతున్నాయని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ముందు రోజే సుప్రీం కోర్టు కు తెలిపింది.