జాతీయ వార్తలు

ప్రజా ప్రమేయమే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: ప్రభుత్వ విధానాలను సరైన రీతిలో అమలుచేసి నిర్దేశిత ఫలితాలను సాధించేందుకు వీలుగా టెక్నాలజీని, ఇతర అంశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ బ్యూరోక్రాట్లకు పిలుపునిచ్చారు. దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం, ప్రమేయం అవసరమని, ఈ వాస్తవాన్ని దృ ష్టిలో పెట్టుకుని ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేసే బాధ్యతను చేపట్టాలని పిలుపునిచ్చా రు. ఈ రకమైన స్ఫూర్తే భాగస్వామ్య ప్రజాస్వామ్యానికి వెన్నుదన్నుగా ఉంటుందని, దేశాభివృద్ధికి ఇతోధికంగా దోహదం చేస్తుందని సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో మోదీ స్పష్టం చేశారు. రెండు రోజులపాటు జరిగిన సివిల్ సర్వీసెస్ డే ముగింపు రోజున మాట్లాడిన మోదీ, దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందునాటి పరిస్థితులకు, నేడున్న వాతావరణానికి ఏ రకంగానూ సంబంధం లేదన్నారు. అప్పటి పాలనా వ్యవస్థ ప్రధాన లక్ష్యం ఆంగ్ల పాలకులను సురక్షితంగా ఉంచడమేనని, కాని నేటి మారిన పరిస్థితుల్లో పాలనా వ్యవస్థ అంతిమ ధ్యేయం సామాన్యుడికి అన్ని సౌకర్యాలు కల్పించి ఊరట నందించడమేనని మోదీ తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను, పథకాలను, గరి ష్ఠ స్థాయి ఫలితాలను సాధించే విధంగా సరికొత్త రీతిలో అమలుచేయాలని స్పష్టం చేసిన ఆయన ఇందుకోసం టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపా రు. భారత్ వంటి భిన్న సంస్కృతులు, భి న్న మతాలతో కూడిన వైవిధ్యభరిత దేశం లో ప్రజల భాగస్వామ్యంతోనే ఏ పథకమై నా, కార్యక్రమమైనా పరిపుష్టం అవుతుంద ని, నిర్దేశిత ఫలితాలు సాధించడానికి ప్రజలను మమేకం చేయడం ఒక్కటే ప్రజాస్వామిక మార్గమని మోదీ తెలిపారు. విధానాల రూపకల్పన, చట్టాలను తయారు చేయడంలోనూ ప్రజా ప్రయోజనాలే పరమావధి గా వ్యవహరించాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యక్రమాలు, విధానాలు, అభివృద్ధి అంశాలకు సంబంధించిన కథనాల సంపుటాలతో కూడిన పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. అలాగే ప్రభుత్వ పథకాలను ఫలవంతమైన రీతిలో అమలుచేసినందుకు అవార్డులను ప్రదానం చేశా రు. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ప్రజా సంక్షేమంకోసం నిరుపమాన సేవలు చేసినవారికి వీ టిని ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడిన మోదీ మంచి పనితీరును, ఫలితాలను సాధించాలంటే స్ఫూర్తి అనేది ప్రధానమని, ఎంతగా ప్రోత్సాహం లభిస్తే అంతగానూ ఉత్తమ ఫలితాలను సాధించేందుకు ఆస్కా రం ఉంటుందని స్పష్టం చేశారు.

చిత్రం..ప్రధాని చేతులమీదుగా అవార్డు అందుకుంటున్న కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్