జాతీయ వార్తలు

మమ్మల్ని విడదీయలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఏప్రిల్ 22: ఊహించిన విషయమే వెలుగులోకొచ్చింది. ఏఐఏడీఎంకే-బీజేపీ సాన్నిహిత్యం వాస్తవమేనని ఆ పార్టీ తాజా ప్రకటనతో తేలిపోయింది. కావేరీ వ్యవహారం లో లోక్‌సభలో రాద్దాంతం సృష్టించిన ఆ పార్టీ ఎంపీలకు బీజేపీ పరోక్ష మద్దతుందన్న ఆరోపణలకు బలాన్నిస్తూ ‘మా బంధాన్ని చెడగొట్టడం ఎవరితరమూ కాదు’ అని అన్నాడీఎంకే నాయకత్వం ప్రకటించింది. కావేరీ అంశంపై పెద్దఎత్తున ఉద్యమానికి దిగిన విపక్ష డీఎంకే, దాని మిత్రపక్షాలను ఎద్దేవా చేస్తూ, ‘ఎన్ని నిరసనలైనా నిర్వహించండి. మరెన్ని ప్రదర్శనలైనా చేసుకోండి. అంతమాత్రాన బీజేపీతో ఏఐడీఎంకే అనుబంధాన్ని మీరు తుంచలేరు’ అని వ్యాఖ్యానించింది. ‘కేంద్రం -రాష్ట్రం మధ్య సాన్నిహిత్యానికి ఎవరూ తూట్లు పొడవలేరంటూ ఏఐడీఎంకె అధికార పత్రిక ‘నమదు పురచ్చి తలైవి అమ్మ’ స్ప ష్టం చేయడం గమనార్హం. బీజేపీతో ఏఐడీఎంకేకు ఉన్న అనుబంధాన్ని తుంచటానికి డీఎంకే, దాని మిత్రపక్షాలు కావేరీ అంశంపై అనవసర రా ద్ధాంతం చేశాయని ఆరోపించింది. భారత రా జకీయాల్లో ఈ రెండు పార్టీలు డబుల్ బారె ల్ గన్ మాదిరి పని చే స్తాయన్న సంకేతాలు ఇచ్చింది. ‘మార్గం స్పష్టం గా ఉంది. ఇద్దరికీ ఎవరి ల క్ష్యాలు వారికున్నాయి. ఉమ్మడి అంశాలను దృ ష్టిలో పెట్టుకుని రోడ్‌మ్యాప్ సిద్ధం చేసుకోవడం, సమస్యపై తుది నిర్ణయానికి రావడం ఒక్కటే తరువాయి’ అని కావేరీ అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ అధికార పత్రి క ఓ కథనంలో పేర్కొంది. డీఎంకే అనవసర రాద్దాంతాన్ని సృష్టించి బద్నాం చేసే ప్రయత్నాలకు ఒడిగట్టిందని ఆరోపించింది. అయితే విపక్షాల ఆటలు సాగలేదని, కావేరీ వివాదానికి కేంద్రంలోని బీజేపీతో కలిసి త్వరలోనే ఓ పరిష్కారాన్ని సూచించబోతున్నట్టు ఏఐడీఎంకే వెల్లడించింది.