జాతీయ వార్తలు

సీఎంపై పోటీకి సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఏప్రిల్ 22: కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై పోటీకి తాను సిద్ధంగా ఉన్నాననీ, అయితే పార్టీ అధినాయకత్వం కోరిన పక్షంలో బదా మీ నియోజకవర్గంలో బరిలోకి దిగుతానని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యెడ్యూరప్ప స్పష్టం చేశా రు. సిద్దరామయ్యపై ఎవరిని పోటీకి దింపాలనేది పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిర్ణయిస్తారని, ఒకవేళ తనను అడిగితే తాను సిద్ధంగా ఉన్నానని చిక్‌మగళూరులో ఆదివారం విలేఖరులకు తెలిపారు. బదామీలో సిద్దరామయ్యను ఓడించడానికి దీటైన అభ్యర్థినే బరిలోకి దింపుతామని, ఆయన్ని కచ్చితంగా ఓడిస్తామని కూడా యెడ్యూరప్ప స్పష్టం చేశారు. అయితే, సిద్దరామయ్యపై పార్టీ ఎంపీ బి. శ్రీరాములును బరిలోకి దింపుతారని ఊహాగానాల నేపథ్యంలో బీజేపీ నాయకత్వం నిర్ణ యం మేరకే నడుచుకుంటానని మ రోపక్క శ్రీరాము లు ప్రకటించారు. ‘మేము క్రమశిక్షణ కలిగిన సైనికులం. పార్టీ నాయకత్వం ఎక్కడినుంచి పోటీచేయమని ఆదేశిస్తే అక్కడ పోటీచేస్తా’ అని శ్రీరాములు వెల్లడించారు. చిత్రదుర్గ జిల్లాలోని మొలకల్మూర్ నియోజకవర్గం అభ్యర్థిగా శ్రీరాములు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. కాగా, ముఖ్యమంత్రి సిద్దరామయ్య రెండు నియోజకవర్గాలనుంచి బరిలోకి దిగుతున్నారు. చాముండేశ్వరి నియోజకవర్గంతో పాటు బాగల్‌కోట్‌లోని బాదామి నుంచి కూడా ఆయన పోటీచేస్తున్నారు. రెండో నియోజకవర్గంనుంచి పోటీచేస్తారా లేదా అన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ నెల 24న ఆయన బాదామి నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు.