జాతీయ వార్తలు

అభిశంసన.. తిరస్కృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ. ఏప్రిల్ 23: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాను తొలగించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్‌తోపాటు ఏడు పార్టీలు ఇచ్చిన అభిశంసన నోటీసును రాజ్యసభ అధ్యక్షుడు, ఉప రాష్టప్రతి ఎం. వెంకయ్యనాయుడు సోమవారం తిరస్కరించారు. కాంగ్రెస్, రెండు వామపక్షాలు, ఎన్సీపీ, ఎస్పీ, బీఎస్పీకి చెందిన 64 మంది రాజ్యసభ సభ్యులు ఇచ్చిన అభిశంసన నోటీసులో ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై చేసిన ఐదు ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. అందుకే అభిశంసన నోటీసును తిరస్కరిస్తున్నానని వెంకయ్య తొమ్మిది పేజీల ఆదేశంలో పేర్కొన్నారు. అభిశంసన నోటీసులో చేసిన ఆరోపణలు న్యాయవ్యవస్థ స్వాతంత్య్రాన్ని హరించేవిగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ప్రధాన న్యాయమూర్తిపై చేసిన ఆరోపణల విషయంలో నోటీసుపై సంతకం చేసిన సభ్యులకే స్పష్టత లేదన్నారు. సీజే దీపక్ మిశ్రాపై ప్రతిపక్షాలు ఇచ్చిన అభిశంసన నోటీసును ఆమోదించాలా? తిరస్కరించాలా? అనే అంశంపై తాను పలువురు న్యాయకోవిదులు, రాజ్యాంగ నిపుణులు, పార్లమెంటు ఉభయ సభల మాజీ సెక్రటరీ జనరల్స్, మాజీ న్యాయాధికారులు, లా కమిషన్ సభ్యులతో చర్చించాను. ఈ అంశంపై మాజీ అటార్నీ జనరల్, న్యాయ నిపుణులు, సీనియర్ ఎడిటర్లు వ్యక్తం చేసిన అభిప్రాయాలనూ పరిశీలించాను. వీరందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటే అభిశంసన నోటీసును ఆమోదించాల్సిన ఆవశ్యకత కనిపించలేదు అని వెంకయ్య తెలిపారు. అభిశంసన నోటీసులో ప్రతిపక్షాలు చేసిన ప్రతి ఆరోపణనూ పరిశీలించి న్యాయ నిపుణులతో లోతుగా చర్చించిన తరువాతే ఈ నిర్ణయానికి వచ్చినట్టు
వెల్లడించారు. రాజ్యాంగంలోని 124(4) ఆర్టికల్ ప్రకారం దుష్ప్రవర్తన, అసమర్థత కారణంగానే న్యామూర్తులను తొలగించేందుకు వీలున్నది. దీపక్ మిశ్రా దుష్ప్రవర్తనకు పాల్పడినట్లుకానీ, అసమర్థుడనికానీ ఎక్కడా వెల్లడి కాలేదు అని స్పష్టం చేశారు. అభిశంసన నోటీసు ఇచ్చిన పార్లమెంటు సభ్యులు కూడా దీపక్ మిశ్రాపై చేసిన ఆరోపణల విషయంలో కచ్చితమైన అభిప్రాయాలను వ్యక్తం చేయలేదు. ప్రసాద్ విద్యా సంస్థల కుంభకోణంలో దీపక్ మిశ్రా భాగస్వామి కావచ్చునని మాత్రమే చెప్పారు తప్ప కుట్రలో భాగస్వామి అని కచ్చితంగా చెప్పలేదని పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి పరిపాలనా సంబంధమైన ఆదేశంపై తేదీలు మార్చి ఉండవచ్చునని ఎంపీలు అభిప్రాయపడ్డారు తప్ప ఆయన కచ్చితంగా తేదీలు మార్చారని చెప్పలేకపోయారు. ఎంపీలకే స్పష్టత లేనప్పుడు ఈ ఆరోపణను ఎలా విశ్వసించగలుగుతామని ప్రశ్నించారు. ప్రధాన న్యాయమూర్తి దుష్ప్రవర్తనను స్పష్టంగా నిరూపించలేకపోయారని ఉపరాష్టప్రతి అభిప్రాయపడ్డారు. ప్రధాన న్యాయమూర్తి రోస్టర్ మాస్టర్ అని ఐదుగురు గౌరవ న్యాయమూర్తుల బెంచి అభిప్రాయపడిన విషయాన్ని వెంకయ్య ఉటంకించారు. కేసుల కేటాయింపు వ్యవహారం కోర్టు అంతర్గత వ్యవహారం. రోస్టర్ సమస్యను న్యాయమూర్తులు తమలో తాము పరిష్కరించుకోవాల్సిందేనని అన్నారు. స్వతంత్ర న్యాయవ్యవస్థ కొనసాగాలని రాజ్యాంగం స్పష్టం చేస్తోందని గుర్తు చేశారు. ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలపై తదుపరి దర్యాప్తు జరిపించవలసిన అవసరం లేదని వెంకయ్య అన్నారు. న్యాయవ్యవస్థ అధికారాన్ని గౌరవించి కాపాడినప్పుడే అది తన విధులను సమర్థవంతంగా నిర్వహించ గలుగుతుందని అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థ పునాదులు విశ్వసనీయత, ఆత్మవిశ్వాసంపై ఆధారపడి ఉంటాయి. ఈ పునాదులను కుదుపివేయటం మంచిది కాదని సూచించారు. ప్రతిపక్షం అభిశంసన నోటీసుద్వారా రాజ్యసభ సభ్యుల హ్యాండ్‌బుక్‌లో సూచించిన పార్లమెంటరీ సంప్రదాయాలు, విధులను ఉల్లంఘించారని వెంకయ్య విమర్శించారు. రాజ్యసభ అధ్యక్షుడు ఆమోదించేంత వరకు అభిశంసన నోటీసుల గురించి ప్రచారం చేసుకోకూడదు. అయితే ప్రతిపక్షం సభ్యులు మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారని ఉపరాష్టప్రతి ఆరోపించారు. ఏడు పార్టీల నాయకులు ఏప్రిల్ 20న అభిశంసన నోటీసును తనకు అందజేసిన వెంటనే విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి బహిరంగ ప్రకటనలు చేస్తూ ప్రధాన న్యాయమూర్తిపై ఆరోపణలు కురిపించారు. పార్లమెంటరీ గౌరవ, మర్యాదలకు ఇది విరుద్ధమని వెంకయ్య స్పష్టం చేశారు. అభిశంసన వ్యవహారంపై పత్రికల్లో పలు ప్రకటనలు చేయటం ద్వారా పరిస్థితిని మరింత విషమం చేసేందుకు ప్రయత్నం జరిగింది. ఈ కారణం చేతనే అభిశంసన నోటీసుపై వీలున్నంత త్వరగా నిర్ణయాన్ని ప్రకటించాలనుకున్నానని వెంకయ్య నాయుడు వివరించారు.