జాతీయ వార్తలు

సుప్రీంలో సవాల్‌ చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాను తొలగించేందుకు ఇచ్చిన అభిశంసన నోటీసును రాజ్యసభ అధ్యక్షుడు వెంకయ్యనాయుడు తిరస్కరించటం చట్ట విరుద్ధమని, దీనిపై తాము సుప్రీం కోర్టుకు వెళుతున్నామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ స్పష్టం చేశారు. సిబల్ సోమవారం ఏఐసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వెంకయ్యనాయుడు నోటీసును ఏవిధంగా తిరస్కరిస్తారని ప్రశ్నించారు. ప్రాథమిక స్థాయిలోనే తిరస్కరించటం విచిత్రంగా ఉందంటూ, చాలా విషయాలు వెలుగులోకి రావటం బీజేపీకి ఇష్టం లేదని ఆరోపించారు. అభిశంసన నోటీసును తిరస్కరించటం ద్వారా ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశారు. చట్ట ప్రక్రియను విధ్వంసం చేశారు. వాస్తవాలను దాచేసి దర్యాపు జరుగకుండా చేశారు అని కపిల్ సిబల్
దుయ్యబట్టారు. వెంకయ్య నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామని, ఈ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు దీపక్ మిశ్రా విధులకు దూరంగా ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రధాన న్యాయమూర్తిపై వచ్చిన ఆరోపణల్లోని నిజానిజాలు వెలుగులోకి రావాలంటే దర్యాప్తుకు ఆదేశించాలి. దర్యాప్తు జరపకుండానే ఆరోపణల్లో నిజం లేదనటం ఏవిధంగా సమర్థనీయమని నిలదీశారు. అభిశంసన నోటీసును తిరస్కరించటం వెంకయ్య తొందరపాటు చర్య అని విమర్శించారు. అభిశంసన నోటీసును పరిశీలించకుండా తిరస్కరించటం దేశంలో ఇదే మొదటిసారని, ఇది రాజ్యాగ విరుద్ధమని అన్నారు. అభిశంసన నోటీసులో చేసిన ఆరోపణలపై పత్రికా ఎడిటర్లతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? దీనికీ ఎడిటరకూ ఉన్న సంబంధమేమిటని సిబల్ నిలదీశారు. సుప్రీం కోర్టు అంతర్గత పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. కాబట్టే కొన్ని రోజుల క్రితం నలుగురు సీనియర్ న్యాయమూర్తులు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి తమ ఆందోళన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ప్రధాన న్యాయమూర్తిపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవని కపిల్ సిబల్ తెలిపారు. అభిశంసన నోటీసు తిరస్కారంపై కోర్టుకు వెళతాము. సుప్రీం కోర్టు తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని సిబల్ ప్రకటించారు. నోటీసు గురించి పత్రికలకు వెల్లడించటం రాజ్యసభ నియమాలకు విరుద్ధమంటూ వెంకయ్య చేసిన విమర్శను కొట్టివేశారు. సభలో చర్చించాల్సిన అంశాలపై ఇచ్చే నోటీసులను పత్రికలకు వెల్లడించకూడదు. అభిశంసన సభలో చర్చకు వచ్చే అంశం కాదుకదా? అని సిబల్ ప్రశ్నించారు. ఆరోపణల్లో స్పష్టత లేదనటం కూడా సబబు కాదు. ప్రధాన న్యాయమూర్తి తప్పుచేశారని బాధ్యత గల పార్లమెంటు సభ్యుడెవరైనా చెబుతారా? అని కపిల్ సిబల్ ప్రశ్నించారు. అభిశంసన నోటీసుకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదన్నారు.