జాతీయ వార్తలు

నేతాజీ ఫైల్స్ వివరాలివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించి ప్రధాన మంత్రి కార్యాలయంలో ఎన్ని ఫైల్స్ ఉన్నాయో వెల్లడించాలని ప్రధాన సమాచార కమిషనర్ ఆర్‌కె మాధుర్ ఆదేశించారు. అలాగే, సమాచార హక్కు చట్టం ద్వారా వచ్చే దరఖాస్తులపై నిర్దేశిత సమయంలో కచ్చితంగా ప్రతిస్పందించాలని పీఎంవో అధికారులకు సూచించారు. సమాచార హక్కు చట్టం ద్వారా షొభిత్ గోయల్ అనే వ్యక్తి కోరిన సమాచారం మేరకు ఆర్‌కే ఠాకూర్ పీఎంవోకు ఈవిధమైన ఆదేశాలు జారీ చేశారు. 1947 నుంచి 2016 వరకూ నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించి పీఎంవో వద్ద ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? ఎన్ని ప్రజలకు అందుబాటులో ఉంచారు? ధ్వంసమైన, కనిపించకుండా పోయిన ఫైల్స్ ఎన్నో తెలుపాలంటూ 2017 జనవరిలో షోభిత్ గోయల్ పీఎంవోకు దరఖాస్తు చేశారు. పీఎంవోనుంచి సంతృప్తికర్తమైన సమాచారం లభించకపోవడంతో, నేతాజీకి సంబంధించిన ఫైల్స్ వివరాలు వెల్లడించేలా ప్రజా సమాచార ప్రధానాధికారిని ఆదేశించాలంటూ కేంద్ర సమాచార కమిషన్‌ను షోభిత్ ఆశ్రయించారు. సరైన సమాచారంతో స్పందించాలంటూ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు ఆ దరఖాస్తును పీఎంవో బదిలీ చేసి ఊరుకుందని, సమాచార హక్కు చట్టం ప్రకారం ఐదు రోజుల్లో దరఖాస్తుపై ప్రతిస్పందించాల్సి ఉందన్న విషయాన్ని గోయల్ తన దరఖాస్తులో ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై జరిగిన విచారణలో పీఎంవో అధికారులు తమ వాదనలు వినిపిస్తూ నేతాజీకి సంబంధించి 58 ఫైళ్లు తమ కార్యాలయ పరిధిలో ఉన్నాయని, వాటిని జాతీయ ఆర్కీవ్స్ విభాగంలో భద్రపర్చామన్నారు. దరఖాస్తుదారుడు కోరుతున్న మిగిలిన సమాచారం సన్నితమైన వ్యవహారం కావడంతో, వివరాలు వెల్లడించేందుకు సమయం పట్టవచ్చన్నారు. తనవద్ద 58 ఫైల్స్ ఉన్నట్టు చెబుతున్న పీఎంవో అధికారులు, తనకు పంపిన లేఖలో తప్పుడు సమాచారం ఇచ్చారని గోయల్ వాదించారు. దీనిపై మాధూర్ స్పందిస్తూ దరఖాస్తుదారుడి 2017 జనవరి 5నాటి దరఖాస్తు ప్రకారం నేతాజీకి సంబంధించి పీఎంవో వద్ద ఎన్ని ఫైల్స్ ఉన్నాయో ఇప్పటికైనా వారంలో సరైన సమాచారం పంపించాలని ఆదేశించారు. అలాగే, ఆర్టీఐ చట్టం ద్వారా వచ్చే దరఖాస్తులపై నిర్దేశిత సమయంలో కచ్చితంగా ప్రతిస్పందించాల్సిన అవసరం ఉందని పీఎంవోకు సూచించారు.