జాతీయ వార్తలు

గడ్చిరోలి ఎన్ కౌంటర్‌లో మృతుల గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఏప్రిల్ 23: తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ సరిహద్దు దండకారణ్యంలో ఆదివారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్ ఘటనలో 16 మంది మావోయిస్టులు మృతి చెందగా, సోమవారం 11 మంది మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మహారాష్టల్రోని గడ్చిరోలి జిల్లా చత్తీస్‌గఢ్, బీజాపూర్ సరిహద్దుల్లోని కఠనాఫుర్ అటవీప్రాంతంలో మూడు మావోయిస్టు దళాలు, దండకారణ్యంలోని దక్షిణ జోనల్ కమిటీ ప్ల్లీనరీ సమావేశం జరుగుతుందని సిఆర్‌పిఎఫ్ పోలీసులు మెరుపుదాడి చేసి 16 మంది నక్సల్స్‌ను మట్టుపెట్టారు. హోరాహోరీగా జరిగిన ఎదురు కాల్పులలో సుమారు 8 మంది నక్సల్స్ గాయాలతోతప్పించుకొని పోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత వరంగల్ జిల్లాకు చెందిన శ్రీను అలియాస్ శ్రీకాంత్ అలియాస్ విజేందర్ రాములుతోపాటు ఆయన భార్య శాంతాబాయి అలియాస్ మంగ్లి మృతి చెందడం గమనార్హం. శ్రీను సౌత్ డివిజన్ ఇన్‌చార్జిగా పెరిమెలి దళ కమాండర్‌గా వ్యవహరిస్తుండగా, అతనిపై ప్రభుత్వం 20లక్షల రివార్డును ప్రకటించింది. శ్రీను భార్య శాంతాబాయి దక్షిణ డివిజన్ కార్యదర్శిగా అహేరి దళ కమాండర్‌గా పని చేస్తుండగా, ఆమెపై రూ.8 లక్షల రివార్డు ఉంది. కాగా సంఘటనా స్థలంలో ఆదివారం రాత్రి వరకు వర్షం కురియడంతో పోలీసులకు శాటిలైన్, వైర్‌లెస్ వ్యవస్థ అందుబాటులో లేకపోవడంతో సోమవారం ఉదయం మృతదేహాలను మహారాష్టల్రోని గడ్చిరోలి పోలీసు కార్యాలయానికి తరలించారు. మృతుల్లో 11 మందిని గుర్తించగా, తొమ్మిది మంది పురుషులు, ఏడుగురు మహిళా నక్సల్స్ ఉన్నట్టు గడ్చిరోలి ఎస్పీ అభినవ్ దేశ్‌ముఖ్ తెలిపారు. గడ్చిరోలికి చెందిన డివిజన్ సెక్రెటరీ సాయినాథ్ అలియాస్ ఆత్రం డోలేష్, గడ్చిరోలి జిల్లా ధనోరకు చెందిన దళ సభ్యుడు రాజేష్ అలియాస్ డామా నరోటి, గడ్చిరోలి జిల్లా డామ్రాఘడ్‌కు చెందిన సుమన్ అలియాస్ జత్రి కులియేలి, పరమేలి దళం ఏరియా కమిటీ సభ్యుడు నగేష్ అలియాస్ దుల్సా కన్నా, పరమేళి దళ కమిటి సభ్యుడు తిరుపతి అలియాస్ ధర్ము, చత్తీస్‌ఘడ్ కంకేర్ జిల్లాకు చెందిన దళ సభ్యుడు శ్రీకాంత్ అలియాస్ దుర్స, ఎల్‌జిఎస్ కమిటి సభ్యుడు రాజు అలియాస్ రమేష్ అలియాస్ నరేష్, గడ్చిరోలి జిల్లా ప్లాటూన్ కమాండర్ తన్ను అలియాస్ బిచ్చు, గడ్చిరోలి జిల్లా పరమేలి దళ సభ్యురాలు అనిత అలియాస్ మడావి బాలి ఉన్నారు. మిగతా ఐదుగురు మావోయిస్టులను గుర్తించాల్సి ఉందని ఎస్పీ వెల్లడించారు. ఇదిలా ఉండగా మావోయిస్టు దండకారణ్య కోటాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగిన నేపథ్యంలో తప్పించుకున్న నక్సల్స్ కోసం అహేరి, ఇంద్రావతి, గడ్చిరోలి, ప్రాణహిత సరిహద్దు ప్రాంతాల్లో ఆంటీ నక్సల్స్ స్వాడ్ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేపట్టగా, ఉత్తర తెలంగాణ పోలీసులు హైఅలర్ట్ ప్రకటించడం గమనార్హం. ఎన్ కౌంటర్ సంఘటనా స్థలం వద్ద ఏకె 47తోపాటు 303 రైఫిళ్లు, మూడు 12 బోర్ తపంచాలు, ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అక్కడి పోలీసులు తెలిపారు.

చిత్రం..ఎన్‌కౌంటర్ అనంతరం మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను చూపుతున్న సిఆర్‌పిఎఫ్ పోలీసులు