జాతీయ వార్తలు

అమెరికానుంచి ఫిరంగుల కొనుగోలుకు ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 25: అమెరికా నుంచి సుమారు 750 మిలియన్ డాలర్ల వ్యయంతో 145 అతి తేలికయిన పొట్టి ఫిరంగులను కొనుగోలు చేయడానికి భారత రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం అనుమతించింది. 18 ధనుష్ ఆర్టిల్లరీ గన్‌లను పెద్ద మొత్తంలో తయారు చేయడానికి కూడా అనుమతించింది. బోఫోర్స్ కుంభకోణం వెలుగు చూసినప్పటి నుంచి గత మూడు దశాబ్దాలలో భారత్ ఇలాంటి ఆయుధ వ్యవస్థలను విదేశాల నుంచి సేకరించడం ఇదే తొలిసారి. రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అధ్యక్షతన శనివారం ఇక్కడ సమావేశమైన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డిఎసి) రూ. 28వేల విలువ గల ఒక కొత్త పథకం సహా 18 ప్రతిపాదనలపై చర్చించింది. ‘బయ్ ఇండియన్’ కేటగిరి కింద రూ. 13,600 కోట్ల వ్యయంతో ఆరు తరువాతి తరం క్షిపణి నౌకలను నిర్మించే మరో కీలక ప్రాజెక్టు కూడా యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ (ఎఒఎన్)ను పొందింది. దీనివల్ల ఇప్పుడు నేవీ టెండర్లు జారీ చేయడానికి వీలు పడుతుంది. ఫారిన్ మిలిటరీ సేల్స్ (ఎఫ్‌ఎంఎస్) మార్గంలో అమెరికా నుంచి 145 అతి తేలికయిన పొట్టి ఫిరంగులను కొనుగోలు చేయడానికి డిఎసి అనుమతించిందని రక్షణ మంత్రిత్వ శాఖలోని ఒక సీనియర్ అధికారి చెప్పారు. ఈ ఫిరంగులను భారత్‌లో డెలివరీ చేయడం ద్వారా మన దేశానికి పెద్ద మొత్తంలో రవాణా వ్యయం తప్పుతుందని ఆయన వివరించారు. 25 కిలో మీటర్ల దూరంలో గల లక్ష్యాలను ఛేదించే ఈ ఫిరంగుల సరఫరాకు ఉద్దేశించిన కాల పరిమితిని కూడా డిఎసి తగ్గించింది. అయితే ఖచ్చితమైన కాల పరిమితి తెలియదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. చైనా సరిహద్దులోని అరుణాచల్ ప్రదేశ్, లడఖ్‌లలో గల ఎత్తయిన ప్రదేశాలపై ఈ ఫిరంగులను మోహరిస్తారని ఆ వర్గాలు వెల్లడించాయి.