జాతీయ వార్తలు

బ్రహ్మోస్ క్షిపణితో సుఖోయ్ విమానం తొలి గగన విహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూన్ 25: బ్రహ్మోస్ క్షిపణి బిగించిన సుఖోయ్ యుద్ధ విమానం శనివారం మహారాష్టల్రోని నాసిక్‌లో ఉన్న హెచ్‌ఏఎల్ విమానాశ్రయంనుంచి తొలిసారిగా శనివారం గగనతలంలో విహరించింది. దీంతో అత్యంత శక్తివంతమైన ఈ క్షిపణిని ప్రయోగించడానికి ఈ యుద్ధ విమానం భారత వైమానిక దళానికి వేదిక కానుంది. ఇంత భారీ (2500 కిలోల బరువుండే) క్షిపణిని ఒక యుద్ధ విమానానికి అనుసంధానం చేయడం ప్రపంచంలో ఇదే మొదటిసారని బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ (బిఏపిఎల్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ సుధీర్ కుమార్ చెప్పారు. ఈ విమానం ఆకాశంలో దాదాపు 45 నిమిషాలు విహరించిందని, విమానం, సిస్టమ్స్ పరీక్షా విభాగానికి చెందిన ఫ్లైట్‌టెస్ట్ సిబ్బంది అయిన వింగ్ కమాండర్ ప్రశాంత్ నాయర్, వింగ్ కమాండర్ ఎంఎస్ రాజు ఈ విమానాన్ని నడిపినట్లు హెచ్‌ఏఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ క్షిపణిని అనుసంధానం చేయడానికి వీలుగా దాదాపు 40 సుఖోయ్-30 ఎంకెఎల్ విమానాలను ఆధునీకరించనున్నారు.
ఈ తొలి పరీక్ష అనంతరం వరసగా మరికొన్ని పరీక్షలు జరిపిన అనంతరం ఎస్‌యు30 ఎంకెఎల్ విమానంపై బ్రహ్మోస్ క్షిపణికి సర్ట్ఫికేషన్ ఇవ్వడం జరుగుతుందని హెచ్‌ఏఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ టి సువర్ణ రాజు ఈ సందర్భంగా చెప్పారు.